Jagananna Chedodu 2023-24 : చేదోడు నాల్గవ ఏడాది అమౌంట్ విడుదల, స్టేటస్ చెక్ చేయండి

Jagananna Chedodu 2023-24 : చేదోడు నాల్గవ ఏడాది అమౌంట్ విడుదల, స్టేటస్ చెక్ చేయండి

రాష్ట్ర వ్యాప్తంగా రజకులు నాయి బ్రాహ్మణులు మరియు టైలర్ లకు ప్రతి ఏటా పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించేటటువంటి జగనన్న చేదోడు అమౌంటును వరుసుగా నాలుగో ఏడాది ముఖ్యమంత్రి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగింది.

రాష్ట్ర వ్యాప్తంగా 3.25 లక్షల మంది ఖాతాల్లో నగదు

రాష్ట్రవ్యాప్తంగా 3,25,020 మంది అర్హులైన రజకులు నాయి బ్రాహ్మణులు మరియు టైలర్ లకు 325.02 కోట్ల ఆర్థిక సహాయాన్ని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పర్యటనలో భాగంగా సీఎం లబ్ధిదారుల ఖాతాలో బటన్ నొక్కి అమౌంట్ ను చేయడం జరిగింది.

షాపులు కలిగి ఉన్నటువంటి రజకులు నాయి బ్రాహ్మణులు ట్రైలర్లకు ప్రతి ఏటా పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం జగన్ అన్న చేదోడు పథకం ద్వారా అందిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఈ నాలుగు సంవత్సరాలలో ఈ పథకానికి గాను 1252.52 కోట్ల రూపాయలను రాష్ట్రప్రభుత్వం ఖర్చు చేసినట్లు పేర్కొంది.

ఈ విడత లో భాగంగా 1,80,656 మంది టైలర్ల కు, 39,813 మంది నాయి బ్రాహ్మణులకు మరియు 1,04,551 మంది రజకులకు అమౌంట్ ను జమ చేయడం జరిగింది.

CM Releases Jagananna Chedodu 2023-24 amount for the fourth consecutive year.

జగనన్న చేదోడు పేమెంట్ స్టేటస్ వివరాలు ఇలా చెక్ చేయండి

జగనన్న చేదోడు పథకానికి సంబంధించి పేమెంట్ స్టేటస్ వివరాలను మీరు కింది లింక్ లో ఇవ్వబడినటువంటి అధికారిక పోర్టల్ కి వెళ్లి మీ ఆధార్ తో చెక్ చేయవచ్చు.

Jagananna Chedodu Payment Status 2023-24

Scheme దగ్గర మీరు జగనన్న చేదోడు ఎంచుకొని , year దగ్గర 2023-24 అని ఎంచుకోవాలి. ఆ తర్వాత UID దగ్గర మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, Captcha కోడ్ ను యధావిధిగా టైప్ చేసి Get OTP పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది.

ఆ తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి వచ్చినటువంటి ఓటిపి వివరాలను ఎంటర్ చేసి మీ పథకానికి సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ మరియు పేమెంట్ స్టేటస్ వివరాలను సులభంగా పొందవచ్చు. ఇందుకు సంబంధించినటువంటి స్టెప్ బై స్టెప్ పూర్తి ప్రాసెస్ పైన లింక్ లో ఇవ్వబడింది చెక్ చేయండి.

Click here to Share

One response to “Jagananna Chedodu 2023-24 : చేదోడు నాల్గవ ఏడాది అమౌంట్ విడుదల, స్టేటస్ చెక్ చేయండి”

  1. C Madhu babu Avatar
    C Madhu babu

    Jaganna chautha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page