ఆంధ్రప్రదేశ్ లో పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. నూతన సంవత్సరం నుంచి ఫించన్ మొత్తాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జగన్ సర్కారు బుధవారం విడుదల చేసింది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలతో పాటు తదితర వారికి ఇవ్వననున్న సామాజిక పెన్షన్లు ఇప్పటి వరకు రూ.2,750గా ఇచ్చిన ప్రభుత్వం.. జనవరి 1 నుంచి రూ.3000లకు పెంచుతున్నట్లు ప్రకటించింది.
దీంతో జనవరి 1 న ఇచ్చే పెన్షన్ లోనే డిసెంబరు నెలకు సంబంధించిన పెంపుదలను కలిపి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో వైఎస్సార్ ఫించన్ పథకంలో భాగంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులతో పాటు తదితర విభాగాలు దీనికి అర్హత పొందనున్నారు. ఈ పెంపుదలతో ప్రభుత్వంపై అదనంగా 129 కోట్ల రూపాయల మేర భారం పడుతుందని వివరించారు.
ఏపీలో ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సంక్షేమమే తిరిగి తనకు అధికారం అందిస్తుందని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. అదే సమయంలో పాలనా..పార్టీ పరంగానూ వరుస నిర్ణయాలకు సిద్దం అవుతున్నారు. రాజకీయంగా ప్రతిపక్షాలపై పట్టు బిగించే ప్రయత్నాలు చేస్తూనే..సంక్షేమ ఓట్ బ్యాంక్ ను మరింత పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా పెన్షన్ల లబ్దిదారుల కు సంబంధించి ముఖ్య నిర్ణయం తీసుకున్నారు. 65.98 లక్షలకు చేరిన లబ్దిదారులు: ఇదే సమయంలో అర్హత ఉండీ పెన్షన్ అందని వారిని గుర్తించేందుకు గత రెండు నెలల కాలంలో జగనన్న సురక్ష ద్వారా ఇంటింట లబ్దిదారులను గుర్తించే ప్రక్రియ ప్రారంభించారు. అందులో అర్హత ఉన్నట్లుగా గుర్తించిన వారికి పెన్షన్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు,
తాజాగా కొత్తగా మంజూరు చేసిన వారితో కలిపి ఈ నెలలో మొత్తం 65,98,138 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం మొత్తం రూ.1,819.02 కోట్లను సెప్టెంబర్లో విడుదల చేసింది. రెండు విడతలతో పాటు కొత్తగా పింఛన్లు మంజూరు చేసిన 3,42,452 మంది లబ్ధిదారుల కోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.96.12 కోట్ల చొప్పున అదనంగా ఖర్చు చేసింది. జగన్ సీఎం అయ్యాక 28,26,884 మందికి ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసారు. గత ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్ల కోసం సరాసరిన రూ.400 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా, ఇప్పుడు సీఎం జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.1,819 కోట్లు ఖర్చు చేస్తోంది.
Leave a Reply