PMJAY: ఈ కార్డ్ ఉంటే ఆరోగ్యశ్రీ లేకున్నా ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉచితంగా చికిత్స

PMJAY: ఈ కార్డ్ ఉంటే ఆరోగ్యశ్రీ లేకున్నా ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉచితంగా చికిత్స

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అనగా ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంటే చాలు. నేరుగా కార్పొరేట్ హాస్పిటల్లో ఉచితంగా చికిత్సను పొందవచ్చు. మరి ఏ హాస్పిటల్స్ లో ఈ చికిత్సను కచ్చితంగా అందిస్తారు? అదేవిధంగా ఈ కార్డును ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం

ఆరోగ్యశ్రీ లేకున్నా ఉచితంగా కార్పొరేట్ చికిత్స

ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన PMJAY అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చినటువంటి ఆరోగ్య పథకం.

పేదవారికోసం ఉచితంగా చికిత్సను అందించేందుకు ఉద్దేశించబడిన ఈ పథకం ద్వారా ఒక కుటుంబానికి 5 లక్షల వరకు ఆరోగ్య భీమా కల్పించడం జరుగుతుంది.

PMJAY పథకం కింద, ఇప్పటివరకు 10 కోట్ల కుటుంబాలకు ₹5 లక్షల ఆరోగ్య బీమా అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ఎంపానెల్డ్ ప్రైవేట్ ఆసుపత్రులలో నగదు రహిత Cashless చికిత్సను ఉచితంగా అందిస్తుంది. అంతేకాకుండా, ఖరీదైన మోకాలి మార్పిడి, కరోనరీ బైపాస్ మరియు ఇతర శస్త్రచికిత్సలు కూడా ఇందులో చేయబడతాయి.

ముందుగా PMJAY అర్హతను ఆన్లైన్ లో ఇలా చెక్ చేయండి

Online పద్దతి:

ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన అర్హతను ఆన్‌లైన్‌లో కింది విధంగా చెక్ చేయండి. మీకు అర్హత ఉన్నట్లయితే మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ కి వెళ్లవచ్చు.

Step 1: PMJAY అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Step 2: సెర్చ్ బార్ దగ్గర ఉన్న PMJAY ‘am I eligible’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

Step 3: మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, OTPని పొందండి.

Step 4: లాగిన్ చేయడానికి సంబంధిత ఫీల్డ్‌లో రూపొందించిన OTPని నమోదు చేయండి.

Step 5: మీ రాష్ట్రాన్ని ఎంచుకోండి

Step 6: మీ పేరు ద్వారా లేదా హౌస్‌హోల్డ్ (HHD) నంబర్ ద్వారా శోధించడాన్ని ఎంచుకోవచ్చు

Step 7: మీరు ఎంచుకున్న వివరాల ఆధారంగా, మీరు మిగితా ఫీల్డ్‌లను పూరించాలి. మీరు సంబంధిత బాక్స్ లన్ని పూరించిన తర్వాత, ‘search’ బటన్‌పై క్లిక్ చేయండి

Step 8: అర్హుల పేర్ల జాబితా ప్రదర్శించబడుతుంది. జాబితాలో మీ పేరు కోసం చూడండి. మీరు PMJAY కార్డ్‌కు అర్హులని కనుగొంటే, మీరు ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్ మరియు దరఖాస్తు ప్రక్రియకు వెళ్లవచ్చు.

Offline పద్దతి :

ఆఫ్లైన్లో మీ అర్హతను చెక్ చేయాలనుకుంటే కింద ఇవ్వబడినటువంటి నంబర్స్ కి కాల్ చేయండి.

ఆయుష్మాన్ భారత్ యోజన కాల్ సెంటర్ నంబరు 14555 లేదా 1800-111-565కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. అర్హత ఉన్నచో ఈ-కార్డు పొందేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

గమనిక: ప్రస్తుతం ప్రత్యేక డ్రైవ్ ద్వారా కూడా అక్టోబర్ 2 వరకు తెలుగు రాష్ట్రాలలో ఆయుష్మాన్ క్యాంపులు మరియు హెల్త్ కార్డుల జారీ చేస్తున్నారు. మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. లేదా పైన ఇవ్వబడిన టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి.

PMJAY ఆయుష్మాన్ కార్డు కి రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం

ఆయుష్మాన్ భారత్ కార్డ్ కోసం మీరు కింద ఇవ్వబడిన సెల్ఫ్ లింక్ లో కానీ లేదా ఆయుష్మాన్ భారత్ యాప్ ద్వారా కానీ లేదా కామన్ సర్వీసెస్ సెంటర్స్ అంటే మీసేవ కేంద్రాల ద్వారా కానీ రిజిస్టర్ చేసుకోవచ్చు.

ఇందు కోసం మీరు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, మొబైల్ నెంబర్, బ్యాంక్ ఖాతా వంటివి కలిగి ఉండాలి.

రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న తర్వాత వెరిఫికేషన్ కోసం సంబంధిత అధికారులు మిమ్మల్ని సంప్రదిస్తారు.

వివిధ లింక్స్ కింద ఇవ్వబడ్డాయి చెక్ చేయండి.

PMJAY ఆయుష్మాన్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి

ఇప్పటికే ఆయుష్మాన్ కాదు పొందిన వారు కింది లింక్ ద్వారా మీ ఆధార్ కార్డు ఉపయోగించి ఆయుష్మాన్ కార్డును సులభంగా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఆయుష్మాన్ భారత్ హాస్పిటల్ లిస్ట్ ఎలా చెక్ చేయాలి

ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రభుత్వ మరియు ప్రైవేట్ హాస్పిటల్స్ లిస్ట్ కింది లింక్ ద్వారా చెక్ చేయండి. ప్రైవేట్ హాస్పిటల్స్ కోసం ప్రైవేట్ అని సెలెక్ట్ చేసుకోండి.

హైదరాబాదులో 130 పైగా ప్రైవేట్ హాస్పిటల్స్ సదుపాయం కలదు.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page