తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తాము ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ స్కీములను అమలు చేసేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం రోజున ఈ ఆరు గ్యారెంటీ ల పైన కూడా సీఎం సంతకం చేయనున్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీ స్కీమ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Guarantee Scheme 1 : Mahalakshmi – మహాలక్ష్మీ పథకం
మహిళల కోసం ఉద్దేశించబడిన మహాలక్ష్మి పథకం : ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు ప్రతి నెల ₹2500 నేరుగా తమ బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
అంతేకాకుండా మహిళలకు తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.
పేద మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్.
Guarantee Scheme 2 : Congress Rythu Bharosa కాంగ్రెస్ రైతు భరోసా స్కీమ్
కాంగ్రెస్ రైతు భరోసా స్కీం ద్వారా రైతులకు ప్రతి ఎకరాకు ప్రతి ఏడాది 15వేల రూపాయలు ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
ప్రతి ఎకరాకు ప్రస్తుత ప్రభుత్వం ఏడాదికి పదివేల రూపాయలు ఇస్తుండగా కాంగ్రెస్ ప్రభుత్వం 15000 రూపాయలు ప్రతి ఎకరాకు ఇవ్వనున్నట్లు తెలిపింది. అదేవిధంగా కౌలు రైతులకు కూడా 15000 రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
ఇక రైతు కూలీలకు 12 వేల రూపాయలు ప్రతి ఏటా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
వీటితో పాటు వరి విత్తే వారికి 500 రూపాయలు అదనంగా చెల్లించనున్నారు.
Guarantee Scheme 3 : Gruha Jyothi – తెలంగాణ గృహ జ్యోతి
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మూడో గ్యారెంటీ స్కీం తెలంగాణ గృహ జ్యోతి పథకం ద్వారా ప్రతి నెల 200 యూనిట్ల వరకు ఉచితంగా ప్రతి కుటుంబానికి విద్యుత్ సబ్సిడీ ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
Guarantee Scheme 4 : Indiramma Indlu – ఇందిరమ్మ ఇండ్లు
గ్యారెంటీ నెంబర్ 4 ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సొంత ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షల వరకు నగదు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్రం కోసం పోరాట యోధులకు 250 చదరపు గజాల స్థలం కేటాయించనున్నట్లు కూడా కాంగ్రెస్ ప్రకటించింది.
Guarantee Scheme 5 : Yuva Vikasam – యువ వికాసం
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారెంటీ స్కీమ్స్ లో ఐదవది యువ వికాసం. ఈ గ్యారెంటీ స్కీమ్ ద్వారా విద్యార్థులకు 5 లక్షల వరకు విద్యా భరోసా కార్డ్ ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కాలేజీ పూర్తి అవ్వగానే విద్యార్థులకు ఐదు లక్షల వరకు ఆర్థిక సాయం అందించేందుకు ఈ పథకాన్ని ప్రకటిస్తున్నట్లు ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ వెల్లడించారు.
అదేవిధంగా ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
Guarantee Scheme 6 : Cheyutha – కాంగ్రెస్ చేయూత
కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి ఆరు స్కీమ్స్ లో చివరిదైనా గ్యారంటీ స్కీం 6 పెన్షన్స్ కి సంబంధించినది. ప్రస్తుతం ఇస్తున్నటువంటి పెన్షన్స్ ను 4000 రూపాయలకు పెంచడం అదేవిధంగా పది లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కల్పించడం అనేవి ఈ గ్యారెంటీ స్కీం లో భాగం.
చేయూత పథకం ద్వారా పెన్షన్ పొందుతున్నటువంటి వృద్ధులు వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు , చేనేత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, ఫైలేరియా మరియు డయాలసిస్ పేషెంట్లకు ప్రతినెల 4000 రూపాయల సామాజిక పెన్షన్ అందించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్స్ గురించి పూర్తి వివరాలు వీడియో రూపంలో కింది లింక్ ద్వారా చూడవచ్చు.
Leave a Reply