వైఎస్ఆర్ చేయూత కరెంటు మీటర్ సీడింగ్ ప్రశ్నలు – సమాధానాలు

వైఎస్ఆర్ చేయూత కరెంటు మీటర్ సీడింగ్ ప్రశ్నలు – సమాధానాలు

వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఎలక్ట్రిసిటీ మీటర్ సీడింగ్ చేసే ఆప్షన్ సచివాలయం ఉద్యోగులకు ఇవ్వడం జరిగింది. సీడింగ్ చేసే సమయంలో వారికి తరచుగా వస్తున్న సందేహాలు మరియు వాటి సమాధానాలు.

ప్రశ్న : వైయస్సార్ చేయూత లబ్ధిదారులకి ప్రాపర్టీ,పవర్ బిల్ ట్యాగ్ సంబంధించి కొందరికి రెండు అసెస్మెంట్ నెంబర్లు రెండు పవర్ బిల్లు కూడా ఉన్నాయి కానీ రెండు ఇళ్లను రెంట్ కి ఇవ్వలేదు వీళ్ళకి రెండు ట్యాగింగ్ చేయాలా?

వారు ప్రస్తుతం ఏ ఇంటిలో అయితే ఉన్నారో ఆ ఇంటి వివరాలు మాత్రమే అప్డేట్ చేయాలి.


ప్రశ్న : కొందరు లబ్ధిదారులకి ప్రాపర్టీ అత్తయ్య/ మామయ్య పేరు మీద ఉన్నాయి. అత్తయ్య/ మామయ్య చనిపోయారు ఒక్కరే వారసులు అటువంటి వాళ్లకి ప్రాపర్టీ సొంత అని పెట్టాలా లేదా రెంట్ అని పెట్టాలా ?

సొంత అని పెట్టవచ్చు.

ప్రశ్న : లబ్ధిదారునికి గ్రామాల్లో ఏవైనా ప్రాపర్టీలు ఉన్నట్టయితే వాటిని ట్యాగ్ చేయవచ్చా?

కేవలం అర్బన్ ప్రాపర్టీలను మాత్రమే ట్యాగ్ చేయాలి.

ప్రశ్న : విద్యుత్ వినియోగం ఎన్ని నెలల సరాసరి తీసుకోవాలి ?

12 నెలల సరాసరి తీసుకోవాలి.

ప్రశ్న : విద్యుత్ మీటరు మరియు అర్బన్ ప్రాపర్టీ అందరికీ ట్యాగింగ్ చేయాలా ?

అందరికీ అవసరం లేదు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రాప్తికి ఎవరికి అయితే విద్యుత్ మీటరు నెంబరు ట్యాగింగ్ అవలేదు వారికి మాత్రమే నెంబర్ పై ట్యాగింగ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా అర్బన్ లో ఉన్నటువంటి వారికి ఎవరికీ అయితే ఎటువంటి అర్బన్ ప్రాపర్టీ ట్యాగింగ్ అవ్వకపోయి ఉంటుందో వారికి మాత్రమే మరలా ట్యాగింగ్ చేయాలి.

ప్రశ్న : ఇల్లు అద్దెకి ఉన్నవారికి ఎవరి కరెంటు మీటరు ట్యాగింగ్ చెయ్యాలి ?

లబ్ధిదారుని పేరు మీద సొంత మీటరు లేను అప్పుడు అద్దె ఇంటిలో ఉన్నటువంటి కరెంటు మీటరుకు ట్యాగింగ్ చేయాలి.

ప్రశ్న : ఒక డోరు నెంబర్లు రెంటికి ఉన్న వారివి కరెంటు మీటరు, ప్రాపర్టీ టాక్స్, అసెస్మెంట్ నెంబరు ట్యాగింగ్ చేస్తారు కానీ అర్బన్ ఏరియాలో మనం ట్యాగ్ చేసిన తర్వాత లబ్ధిదారుడు వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోతే అప్పుడు ఏం చేయాలి ?

ఏ సమస్య రాదు వారి వివరాలు ఫీల్డ్ వెరిఫికేషన్లు ఎంటర్ చేయవచ్చు.

ప్రశ్న : ఒక లబ్ధిదారుడు రెండు అసెస్మెంట్ నెంబర్స్ ఉండి ఒక హౌస్ లో మాత్రమే ఉంటే రెండు హౌస్లను కూడా పరిగణలోకి తీసుకోవాలా ?

ప్రస్తుతం ఏ ఇంటిలో ఉంటున్నారో ఆ ఇంటి వివరాలు మాత్రమే ఎంటర్ చేయాలి.

ప్రశ్న : అర్బన్ ఏరియాలో చాలామంది అపార్ట్మెంట్స్ కి వాచ్మెన్ గా ఉంటారు వారికి ఏ అసెస్మెంట్ మరియు ఎలక్ట్రిసిటీ సర్వీస్ నెంబరు ఉండవు వారికి ఏమి చేయాలి ?

అటువంటి కేసులను వదిలి పెట్టవచ్చు.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page