రాష్ట్రవ్యాప్తంగా కౌలు రైతుల ఖాతాలో సెప్టెంబర్ 1 న ముఖ్యమంత్రి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. చాలా మంది కౌలు రైతులు, రైతు భరోసా అమౌంట్ కోసం ఇంకా ఎదురు చూస్తున్నట్లు సమాచారం. అసలు రైతు భరోసా స్టేటస్ ఎలా చెక్ చేయాలి? ఎంత మందికి ఇంకా అమౌంట్ పెండింగ్ ఉంది అనే డీటైల్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
రైతు భరోసా 7500 జమ చేసిన ప్రభుత్వం
ఈ ఏడాది కౌలు రైతులకు రైతు భరోసా సహాయం కింద ₹7500 రూపాయలను ప్రభుత్వం జమ చేసింది. 1.46 లక్షల మంది రైతుల ఖాతాలో 7500/- చొప్పున 109.74 కోట్లు జమ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
రైతు భరోసా పడిందా లేదా స్టేటస్ ఎలా చూడాలి
వైఎస్సార్ రైతు భరోసా సంబంధించి కింది లింక్ లో మీ 12 అంకెల ఆధార్ నంబర్ ఎంటర్ చేసి రైతు భరోసా 2023-24 స్టేటస్ ను తెలుసుకోవచ్చు
ముఖ్య గమనిక: మీకు స్టేటస్ లో ‘Payment Under Processing ‘ అని ఉంటే వారంలోగా మీ ఖాతాలో అమౌంట్ జమ అవుతుంది. ఆ తరువాత Payment Succes అని మారుతుంది.
జూన్ నెల లో రైతు భరోసా అమౌంట్ పూర్తిగా జమ అవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం 15 రోజులు తీసుకుంది. కాబట్టి నిధులను బట్టి ఈ సారి కూడా వారం లేదా రెండు వారాల గడువు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
ఇంకా తమకు పేమెంట్ పడలేదని చాలా మంది రైతులు రిపోర్ట్ చేస్తున్నారు.
కౌలు రైతులకు వైఎస్సార్ రైతు భరోసా జమ అయిందా?
కౌలు రైతులకు వైఎస్సార్ రైతు భరోసా అమౌంట్ మీ ఖాతాలో జమ అయిందా లేదా తెలుసుకునేందుకు స్టడీబిజ్ ద్వారా ఆన్లైన్ పోల్ నిర్వహిస్తున్నాం.
ఈ పోల్ రైతుల అవగాహన కోసం ఉపయోగపడుతుంది. మీకు అమౌంట్ పడినట్లు అయితే పడింది అని ఇంకా జమ కాకపోతే ఇంకా పడలేదు అని సెలెక్ట్ చేసుకోగలరు.
Leave a Reply