PM విశ్వకర్మ: చేతివృత్తుల వారికి అప్లికేషన్స్ ప్రారంభం, 3 లక్షల వరకు సహాయం

PM విశ్వకర్మ: చేతివృత్తుల వారికి అప్లికేషన్స్ ప్రారంభం, 3 లక్షల వరకు సహాయం

చేతి వృత్తులు మరియు సంప్రదాయ కులవృత్తులు చేసుకుంటూ జీవనాధారం సాగిస్తున్నటువంటి వారికి ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా తొలి దశలో 18 రకాల చేతివృత్తుల వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మూడు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం పొందేందుకు చేతి వృత్తుల వారికి అవకాశం కల్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్స్ ఎక్కడ చేసుకోవాలి, అర్హతలు ఏంటి, ఏ కులాల వారికి ఇది వర్తిస్తుంది, ఎంత ఆర్థిక సహాయం పొందవచ్చు వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం.

ప్రారంభమైన పీఎం విశ్వకర్మ అప్లికేషన్స్

ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అప్లికేషన్స్ గ్రామ వార్డు సచివాలయాల స్థాయిలో ఆంధ్ర ప్రదేశ్ లో ప్రారంభం కావడం జరిగింది. తెలంగాణలో అప్లికేషన్స్ కొరకు మీసేవ కేంద్రాలలో సంప్రదించవచ్చు. ఈ పథకాన్ని సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి ప్రారంభించడం ఉన్న నేపథ్యంలో అప్లికేషన్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

కింద ఇవ్వబడినటువంటి అర్హతలు ఉన్నవారు మీ సమీప గ్రామ వార్డు సచివాలయంలో సంప్రదించి తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. దరఖాస్తు తో పాటు లబ్ధిదారుని మొబైల్ నెంబర్, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ పుస్తకం మరియు రేషన్ కార్డు వంటి డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది.

ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అర్హతలు ఏంటి? ఏ కులాలకు వర్తిస్తుంది

ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకానికి సంబంధించి 18 రకాల సంప్రదాయ చేతివృత్తుల వారికి మొదటి దశలో అవకాశం కల్పించడం జరిగింది.

ఈ చేతి వృత్తుల వారి లిస్ట్ కింద ఇవ్వడం జరిగింది.

పూర్తి లిస్ట్ ఇదే..

పిఎమ్ విశ్వకర్మ లో భాగం గా తొలి విడత లో 18 సాంప్రదాయిక చేతివృతులు చేసుకునే వారిని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. పూర్తి జాబితా ఇదే

(1) వడ్రంగులు;

(2) పడవల తయారీదారులు;

(3) ఆయుధ /కవచ తయారీదారులు;

(4) కమ్మరులు;

(5) సుత్తి, ఇంకా పరికరాల తయారీదారులు;

(6) తాళాల తయారీదారులు;

(7) బంగారం పని ని చేసే వారు;

(8) కుమ్మరులు;

(9) శిల్పులు (ప్రతిమలు, రాతి చెక్కడం పని చేసేటటువంటి వారు), రాళ్ళను పగులగొట్టే వృత్తి లో ఉండే వారు;

(10) చర్మకారులు /పాదరక్షల తయారీ దారులు;

(11) తాపీ పనివారు;

(12) గంపలు/చాపలు/చీపురులను తయారు చేసేవారు;

(13) కొబ్బరి నారతో తయారు అయ్యే వస్తువుల ను చేసే వారు, (సాంప్రదాయిక ఆటబొమ్మల రూపకర్తలు);

(14) నాయి బ్రాహ్మణులు;

(15) మాలలు అల్లే వారు;

(16) రజకులు;

(17) దర్జీలు మరియు;

(18) చేపల ను పట్టేందుకు ఉపయోగించే వలల ను తయారు చేసేవారు

ఈ పథకానికి ప్రధానంగా చాలా వరకు చేతి పనుల వారికి అవకాశం కల్పించడం జరిగింది. ప్రధానంగా కుమ్మరి, కమ్మరి, తాపీ పని చేసే వారు, చర్మకారులు, రజకులు, దర్జీలు, మాలలు అల్లేవారు, శిల్పులు, బంగారం పని చేసేవారు, వడ్రంగులు, చేపలు పట్టె వలలు తయారు చేసేవారు అర్హులు.

ఈ పథకానికి అర్హత పొందటానికి మరికొన్ని కండిషన్స్ కింద ఇవ్వబడ్డాయి చెక్ చేయండి

– 18 సంవత్సరాలు నిండి రిజిస్ట్రేషన్ చేసే సమయానికి పైన ఇవ్వబడిన ఏదో ఒక చేతివృత్తి లో ఉండాలి

– కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ సహాయం అందించడం జరుగుతుంది.

– కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండరాదు.

– గత 5 సంవత్సరాలలో PM స్వనిధి, ముద్ర, PMEGP వంటి రుణాలను తీసుకొని ఉండరాదు ఒకవేళ తీసుకొని ఉంటే వాటిని పూర్తిగా చెల్లించి ఉన్నట్లయితే అటువంటి వారు అర్హులు.

పీఎం విశ్వకర్మ యోజన పథకానికి సంబంధించి బెనిఫిట్స్

అర్హత కలిగి అప్లై చేసుకున్న వారికి విశ్వకర్మ సర్టిఫికెట్ ను ఇవ్వటం జరుగుతుంది. ఈ సర్టిఫికెట్ పొందిన వారు కింది ప్రయోజనాలను పొందవచ్చు.

✓ తొలి విడతలో లక్ష వరకు రుణం కేవలం 5% శాతం వడ్డీ తో పొందవచ్చు.

✓ తొలివిడత అమౌంట్ తీర్చిన తర్వాత రెండో విడత లో భాగంగా 2 లక్షల వరకు అమౌంట్ ఎటువంటి హామీ లేకుండా పొందవచ్చు.

Loan Tranches under PM Vishwakarma 2023

పొందినటువంటి రుణాన్ని ప్రతినెలా ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

✓ ₹15000 వేల వరకు విలువగల పనిముట్లను రాయితీపై అందిస్తారు.

✓ అవసరమైన వారికి నైపుణ్య అభివృద్ధి శిక్షణ కల్పించడం జరుగుతుంది. ఆ సమయంలో రోజుకి 500 రూపాయలు మరియు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది.

✓ ఇంకా అర్హులైన వారికి బ్రాండింగ్ మరియు మార్కెటింగ్ సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతుంది.

పీఎం విశ్వకర్మకు సంబంధించినటువంటి లేటెస్ట్ మరియు పూర్తి సమాచారం కింది వీడియో ద్వారా చూడవచ్చు.

Click here to Share

You cannot copy content of this page