వాణిజ్య వంటగ్యాస్ సిలిండర్ ధర (Commercial LPG Cylinder Price)ను చమురు విక్రయ సంస్థలు తగ్గించాయి. రూ.19 కిలోల సిలిండర్ ధరపై రూ.158 తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించాయి. తాజా తగ్గింపుతో దేశ రాజధాని దిల్లీలో సిలిండర్ ధర (Commercial LPG Cylinder Price) రూ.1,522.50కు చేరింది. గృహ వినియోగ సిలిండర్‌పైన రూ.200 తగ్గిస్తూ కేంద్ర కేబినెట్ ఇటీవలే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఆగస్టులోనూ వాణిజ్య సిలిండర్ ధర (Commercial LPG Cylinder Price)ను ఓఎంసీలు రూ.99.75 తగ్గించాయి. జులైలో రూ.7 పెంచాయి. మే, జూన్ నెలలోనూ ధరల్ని రూ.172, రూ.83 చొప్పున తగ్గించాయి. మరోవైపు కేంద్రం ప్రభుత్వం ఎల్‌పీజీ దిగుమతులపై విధిస్తున్న వ్యవసాయ మౌలికవసతుల అభివృద్ధి సెస్‌ను పూర్తిగా తొలగించింది. సెప్టెంబరు 1 నుంచి 15 శాతం సెస్ ఉండబోదని తెలియజేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
Leave a Reply