E Crop – ఏపీలో ఈ క్రాప్ నమోదుకు ఇంకా 15 రోజులే.. స్టేటస్ చెక్ చేశారా

E Crop – ఏపీలో ఈ క్రాప్ నమోదుకు ఇంకా 15 రోజులే.. స్టేటస్ చెక్ చేశారా

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ముఖ్య సమాచారం.

ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కి సంబందించి రైతులు సాగు చేసినటువంటి పంటల వివరాలను ఈ క్రాప్ లో నమోదు చేయిచుకోవాలని వ్యవసాయ అధికారులు ఆదేశించారు.

సెప్టెంబర్ 15 నాటికి 100% నమోదు పూర్తి చేయాలి

ఖరీఫ్ పంటలకు సంబంధించినటువంటి పంట వివరాలను రైతులు సమీప రైతు భరోసా కేంద్రంలోకి వెళ్లి పంట నమోదు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు తెలిపారు.

ఇప్పటివరకు అన్ని జిల్లాలలో 30 నుంచి 40% వరకు ఈ ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. ఎవరైతే ఇంకా ఖరీఫ్ పంట నమోదు చేసుకోలేదో వారికి సెప్టెంబర్ 15 వరకు అవకాశం కల్పించడం జరిగింది.

సెప్టెంబర్ 15 నాటికి 100% ఈ క్రాప్ బుకింగ్ పూర్తిచేయాలని అటు అధికారులను మరియు రైతులను విజ్ఞప్తి చేశారు.

రైతులు తమ పాస్ పుస్తకం,ఆధార్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కాపీ, ఫోన్ నెంబర్ తో రైతు భరోసా కేంద్రాల్లో సంప్రదించాల్సిందిగా అధికారులు తెలిపారు.

ఈ క్రాప్ నమోదు చేయకపోతే ఏమవుతుంది?

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ పంట అనగా ఈ క్రాప్ నమోదు తప్పనిసరి. ప్రతి సీజన్లో రైతులు సాగు చేసే తమ పంట వివరాలను తప్పనిసరిగా ప్రభుత్వానికి తెలియపరచాల్సి ఉంటుంది. ఈ క్రాప్ చేయకపోతే ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు లభించే ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్, వైఎస్సార్ ఉచిత పంటల భీమా పథకం, వైయస్సార్ పంట రుణాల పథకం వంటి పథకాలు వర్తించవు.

కాబట్టి రైతులు తప్పనిసరిగా తమ సమీప రైతు భరోసా కేంద్రాన్ని సంప్రదించి పూర్తి చేయాలని అధికారులు స్పష్టం చేశారు.

మీ ఈక్రాప్ బుకింగ్ స్టేటస్ ను కింది లింక్ ద్వారా చెక్ చేయండి

Click here to Share

You cannot copy content of this page