ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టులో సిలిండర్ ధరలను ఏకంగా రెండు వందల రూపాయలు తగ్గించిన కేంద్రం, ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద లబ్ధి పొందుతున్న వారికి ప్రస్తుతం 400 రూపాయల రాయితీ ఇస్తుంది.
తాజాగా కేంద్ర క్యాబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ఉజ్వల పథకం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి వారికి మరో వంద రూపాయలు అదనపు రాయితీ ఇస్తున్నట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
ఈ నిర్ణయంతో ఇప్పటికే 400 రూపాయల రాయితీ పొందుతున్నటువంటి ప్రధానమంత్రి ఉజ్వల లబ్ధిదారులు ఇకపై 500 రూపాయల రాయితీని సిలిండర్ పై పొందనున్నారు.
ఈ నిర్ణయం ద్వారా దేశవ్యాప్తంగా 9.59 కోట్ల మందికి లబ్ధి చేకురనుంది. PMUY ద్వారా సిలిండర్ పొందిన అందరికీ 14.2 కేజీల గృహ సిలిండర్ల పై ఈ ₹500 రాయితీ వర్తిస్తుంది.ఏడాది కి 12 సిలిండర్ల వరకు ఈ రాయితీ ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.
మే నెలలో ప్రధానమంత్రి ఉజ్వల పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారికి తోలుత 200 రూపాయల రాయితీ ప్రకటించిన కేంద్రం, ఆ తర్వాత ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి గృహ సిలిండర్లపై 200 రూపాయలను తగ్గించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో ఉజ్వల పథకం లబ్ధిదారులకు 400 రూపాయల రాయితీ లభించగా, ఇక ప్రస్తుతం తీసుకున్నటువంటి నిర్ణయంతో మరో వంద రూపాయలు కలిపి మొత్తంగా 500 రూపాయల రాయితీ లభిస్తుంది.
హైదరాబాద్ లో సిలిండర్ ధర ప్రస్తుతం 955 గా ఉండగా ఉజ్వల లబ్ధిదారులకు 755 కే లభిస్తుంది. ప్రస్తుతం తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇకపై వారికి 655 కే సిలిండర్ ఇంటికి చేరనుంది.
దేశవ్యాప్తంగా BPL కుటుంబాలకు చెందిన పేద మహిళలకు ప్రధానమంత్రి ఉజ్వల పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏటా 12 సిలిండర్ల పై ఈ రాయితీని ఇస్తున్న విషయం తెలిసిందే. 18 ఏళ్ళు నిండిన మహిళలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. తమ కుటుంబంలో ఇప్పటికే ఎవరి పేరు మీద కూడా ఎల్పీజీ కనెక్షన్ ఉండరాదు. అటువంటివారు ఈ ఉజ్వల పథకానికి అప్లై చేసుకోవడానికి ఈ సమీప గ్యాస్ సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు.
Leave a Reply