ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజలకు ఇస్తున్న సామాజిక పెన్షన్లను పెంచాలని నిర్ణయించింది.
ఆసరా పథకం కింద దివ్యాంగులకు ఇస్తున్న ను రూ.3,016 కు వెయ్యి రూపాయలు కలిపి రూ.4,016కు పెంచింది ప్రభుత్వం.
మెదక్ వేదికగా CM KCR దివ్యాంగులకు తీపికబురు అందించనున్నారు. నేటి నుంచి పెరిగిన పెన్షన్ రూ.4016 పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 5.50లక్షల మందికి లబ్ధి జరగనుంది. అదేవిధంగా బీడీ టేకేదారులకు, ప్యాకర్లకు రూ.2016 చొప్పున పెన్షన్ పంపిణీని ప్రారంభిస్తారు.
ఇవాళ మెదక్ జిల్లాలో పర్యటించనున్న CM కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, SP ఆఫీస్, BRS పార్టీ ఆఫీసు ప్రారంభిస్తారు.
ఈ నేపథ్యంలో ఇతర లబ్ధిదారులకు కూడా పెన్షన్ మొత్తాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం వృధ్ధాప్య, వితంతు పింఛన్లను రూ.2,016 నుంచి రూ.3,016కు పెంచాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన పంచాయతీ రాజ్ శాఖ.. ఆర్థిక శాఖకు పంపింది
Leave a Reply