దేశవ్యాప్తంగా చేతి వృత్తులను జీవనాధారంగా కొనసాగిస్తున్నటువంటి వారికి ప్రధానమంత్రి స్వాతంత్ర దినోత్సవ వేళ శుభవార్త అందించారు.
వచ్చేనెల అనగా సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని చేతివృత్తుల వారికి విశ్వకర్మ యోజన [Vishwakarma Yojana ] అనే సరికొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.
సంప్రదాయ చేతివృత్తులపై జీవనాధారం కొనసాగిస్తున్నటువంటి వారికి ఈ పథకాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ వృత్తులైనటువంటి కుమ్మరి, రజకులు, నాయి బ్రాహ్మణ, పద్మశాలీలు, బంగారం పని చేసేటటువంటి కంసాలీలు మరియు ఇతర సంప్రదాయ చేతివృత్తుల వారికి ఈ పథకం వర్తిస్తునట్లు ఆయన ప్రకటించారు.
ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ద్వారా చేనేత కళాకారులు రూపొందించిన ఉత్పత్తులు మరియు సేవల నాణ్యత ను మెరుగుపరచడం. దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లకు వారి ఉత్పత్తులను పరిచయం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
ప్రధానంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలు, మహిళలు, ట్రాన్స్జెండర్లు మరియు సమాజంలోని ఇతర బలహీన వర్గాలకు చెందిన కార్మికుల ఆర్థిక సాధికారతకు ఈ పథకం సహాయపడుతుంది.
ఈ పథకం కోసం 13 నుంచి 15 వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లుగా ప్రధానమంత్రి ప్రకటించారు.
Leave a Reply