దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో నిర్వహించిన వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురువేశారు. అంతకు ముందు రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మా గాంధీకి ప్రధాని నివాళులర్పించారు. అక్కడ నుంచి ఎర్రకోటకు చేరుకుని.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి.. సెల్యూట్ చేశారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ కరోనా తర్వాత భారత్ సామర్థ్యం ప్రపంచానికి తెలిసిందని పేర్కొన్నారు. ఎర్రకోటపై జాతీయ పతాకావిష్కరణ అనంతరం జాతినుద్దేశించి ఆయన ప్రసంగించారు. “కొత్త ప్రపంచంలో భారత్ ను విస్మరించడం ఎవరి తరమూ కాదు. మధ్యతరగతి సొంతింటి కల సాకారానికి కొత్త పథకం తీసుకురాబోతున్నాం. బ్యాంకు రుణాలపై రాయితీ ఇచ్చే కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నాం. పట్టణ ప్రాంతాల దిగువ, మధ్యతరగతి సొంతింటి కల సాకారమే లక్ష్యంగా పథకాన్ని రూపొందిస్తున్నాం. మధ్యతరగతి వారికి లక్షల రూపాయల మేర ప్రయోజనం కల్పించే ఈ పథకం త్వరలో ప్రకటిస్తాం” అని ప్రధాని వ్యాఖ్యానించారు.
వరుసగా పదోసారి ప్రధానిగా మోదీ ఎర్రకోట నుంచి జెండా ఎగురువేయగా… దీంతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రికార్డు సమం అయ్యింది.
Leave a Reply