రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కళ్యాణమస్తు మరియు షాదీ తోఫా లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. కళ్యాణమస్తు మరియు షాది తోఫా అమౌంట్ ను ఈరోజు ముఖ్యమంత్రి రిలీజ్ చేశారు.
ఈ పథకం ద్వారా గత ఏడాది అక్టోబర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ మరియు భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే.
ఏప్రిల్ జూన్ త్రైమాసికం లో వివాహమైన జంటలకు అమౌంట్
రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 2023 నుంచి జూన్ 2023 త్రైమాస్కంలో వివాహం చేసుకున్నటువంటి అర్హులైన 18,883 జంటలకు ముఖ్యమంత్రి 141.60 కోట్ల ఆర్థిక సహాయాన్ని ఈరోజు బటన్ నొక్కి విడుదల చేయడం జరిగింది.
CM Releases YSR Kalyanamasthu 2023 Today [ 9th August 2023 ]
ముఖ్య గమనిక: జూలై 20 వరకు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఈ అవకాశం కల్పించినట్లు సచివాలయం శాఖ తెలిపింది. ఈ కటాఫ్ డేట్ వరకు అప్లై చేసుకున్న వారికి మాత్రమే ప్రస్తుతం అమౌంట్ పడుతుంది.
ఇక మొదటి విడతలో పెళ్లికూతురు ఖాతాలో అమౌంట్ ను జమ చేసిన ప్రభుత్వం, రెండో విడత నుంచి ఆడపిల్ల తల్లి ఖాతాలో నగదు ను జమ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కులాంతర వివాహం లేదా ప్రేమ వివాహం చేసుకున్న వారికి మాత్రం పెళ్లికూతురు ఖాతాలోనే అమౌంట్ జమ చేస్తున్నారు.
వైఎస్ఆర్ కల్యాణమస్తు షాది తోఫా స్టేటస్ ఎలా చూడాలి [Kalyanamasthu 2023 Payment status]
వైఎస్ఆర్ కల్యాణమస్తు మరియు షాది తోఫా స్టేటస్ ను కింది ప్రాసెస్ ఫాలో అయి మీరు స్టేటస్ చూడవచ్చు.
ఈసారి దూదేకుల నూర్ భాషా వారికి కూడా షాది తోఫా
రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి దూదేకుల కులానికి చెందినటువంటి వారికి కూడా కళ్యాణమస్తుకి బదులుగా ఈసారి వైయస్సార్ షాది తోఫా ద్వారా లబ్ధి చేకూర్చడం జరిగింది.
Leave a Reply