Good News : గృహలక్ష్మి పథకం అప్లికేషన్స్ కొరకు ఆగస్ట్ 10 డెడ్ లైన్, 3 లక్షలు వీరికే

Good News : గృహలక్ష్మి పథకం అప్లికేషన్స్ కొరకు ఆగస్ట్ 10 డెడ్ లైన్, 3 లక్షలు వీరికే

రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గృహలక్ష్మి పథకానికి సంబంధించి అప్లికేషన్స్ ప్రారంభమయ్యాయి.

సొంత జాగా ఉంది పక్కా ఇల్లు లేని వారికి ఇల్లు కట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా ఇల్లు నిర్మించుకునేందుకు మహిళల ఖాతాలో మూడు లక్షల రూపాయలను మూడు దశలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది.

ఆగస్టు 10 లోపు దరఖాస్తులు – Gruhalakshmi Application Process

ప్రతి మండలంలో ఉండే తహసిల్దార్ కార్యాలయంలో కానీ లేదా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ ద్వారా ఆగస్టు 10లోపు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించాలని ప్రభుత్వం తెలిపింది.

ఇందుకోసం ఎవరికీ డబ్బులు కానీ లంచం కానీ ఇవ్వరాదని పేర్కొంది.

గృహలక్ష్మి పథకానికి అర్హతలు మరియు మార్గ దర్శకాలు ఇవే

  • సొంత జాగా ఉండి రెండు గదులతో RCC ఇళ్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం సహాయం చేయనుంది
  • మహిళ పేరు మీద ఈ సహాయం అందిస్తారు
  • ప్రతి నియోజకవర్గానికి 3,000 మందికి చొప్పున స్టేట్ రిజర్వ్ కోటా లో 43000 మందికి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మందికి ఆర్థిక సహాయం అందిస్తారు.
  • జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి స్థాయిలో కమిషనర్ ఆధ్వర్యంలో ఈ పథకం అమలు అవుతుంది
  • ఈ పథకానికి మహిళ పేరిట ప్రత్యేక బ్యాంక్ ఖాతా ఉంటుంది. జన్ ధన్ ఖాతాను ఇందుకు ఉపయోగించకూడదు
  • ఇంటి బేస్మెంట్ లెవెల్, రూఫ్ లెవెల్, స్లాబ్ లెవెల్ ఇలా మూడు దశల్లో అమౌంట్ ను అందిస్తారు
  • ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10 శాతం ఇక బీసీ మైనార్టీలకు 50 శాతం కోట తగ్గకుండా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు
  • వీటికి సంబంధించి దరఖాస్తులను కలెక్టర్స్ పరిశీలించి అర్హులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికైన వారికి జిల్లా ఇన్చార్జ్ మంత్రి ద్వారా దశలవారీగా అమౌంటును పంపిణీ చేస్తారు.

అయితే ఆహార భద్రత కార్డ్ ఉండి సొంత స్థలం ఉన్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఆర్సీసీ రూఫ్ స్లాబ్ తో ఇల్లు ఇప్పటికే ఉన్నవారికి లేదా జీవో 59 కింద లబ్ధి పొందిన వారికి ఈ పథకం వర్తించదు.

Follow us on Telegram for regular updates

You cannot copy content of this page