రంగారెడ్డి జిల్లా మన్నెగూడ లో నిర్వహించిన చేనేత దినోత్సవం లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ చేనేత కార్మికులకు వరాలను ప్రకటించారు
చేనేత మిత్ర పథకం కింద ప్రతి మగ్గానికి నెలకు రూ.3వేలు ఇస్తామని మంత్రి KTR ప్రకటించారు. ఈ పథకాన్ని ఆగస్టు, సెప్టెంబర్ నుంచి అమలు చేస్తామన్నారు. చేనేత హెల్త్ కార్డుల ద్వారా ఓపీ సేవలకు రూ.25వేలు ఇస్తామన్నారు. నేటి నుంచి తెలంగాణ చేనేత మగ్గం పథకం అమలు చేస్తామన్నారు. రూ.40.50కోట్లతో 10,652 ఫ్రేమ్ మగ్గాలు అందుబాటులోకి తెస్తామని, మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు టెస్కో సాయం రూ.25వేలకు పెంచుతామన్నారు.
చేనేత కార్మికులకు అందించనున్న లబ్ది వివరాలు
- చేనేతమిత్ర పథకం కింద ప్రతి మగ్గానికి నెలకు ₹3వేలు
- 75 ఏళ్లు దాటిన చేనేతలకు ప్రభుత్వమే బీమా కల్పన
- నేతన్నలకు 16 వేలకుపైగా కొత్త మగ్గాలు
- ₹40.50 కోట్లతో అందుబాటులోకి రానున్న 10,652 ఫ్రేమ్ మగ్గాలు
- చేనేతలకు డీసీసీబీ, టెస్కాబ్ ద్వారా ₹200కోట్ల క్యాష్ క్రెడిట్ లిమిట్ అందించనున్నారు
- ఈ పథకం ఆగస్టు, సెప్టెంబర్ నుంచి అమలు
Leave a Reply