కేవలం నిమిషంలో ఆధార్ తో కొత్త e-PAN కార్డుకి అప్లై చేసుకొనే విధానం

,
కేవలం నిమిషంలో ఆధార్ తో కొత్త e-PAN కార్డుకి అప్లై చేసుకొనే విధానం

పాన్ కార్డ్ అనేది బ్యాంకింగ్‌కు సంబంధించి ఖాతా తెరవడానికి మరియు ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడం లేదా స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయడం లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి వంటి అనేక ఇతర పనులకు కూడా పాన్‌ కార్డు తప్పనిసరి.

పాన్‌కార్డును ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లోనూ పొందవచ్చు. పాన్ కార్డును ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాలి అనుకునే వారు దగ్గర్లోని సచివాలయానికి గాని, మీ సేవ కేంద్రాల ద్వారా కాని లేదా ఇతర ఏజెన్సీల ద్వారా అప్లై చేసుకోవచ్చు.

ఈ ఆర్టికల్ ద్వారా ఎటువంటి డాకుమెంట్స్ అవసరం లేకుండా కేవలం ఆధార్ తో పాన్ కార్డును ఆన్లైన్ లో ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం.

STEP 1 : మీరు ముందుగా కింద ఇవ్వబడిన Income Tax e-Filing (Instant PAN Card Application Link) వెబ్‌సైట్‌ లింక్‌పై క్లిక్‌ చేయండి.

లింక్ ఓపెన్ చేసిన తరువాత కింది విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తరువాత left side లో ఉన్న Instant E-PAN ఆప్షన్ పైన క్లిక్ చెయ్యాలి

STEP 2 : Instant E-PAN ఆప్షన్ పైన క్లిక్ చేసిన తరువాత కింది విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో Get New e-PAN ఆప్షన్ పైన క్లిక్ చెయ్యాలి

STEP 3 : Get New e-PAN ఆప్షన్ పైన క్లిక్ చేసిన తరువాత కింది విధంగా ఓపెన్ అవుతుంది.

STEP 4 : మొదటగా మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ని ఎంటర్ చెయ్యండి. I confirm that ఆప్షన్ పైన క్లిక్ చేసి, Continue పైన క్లిక్ చెయ్యండి.

STEP 5 : Continue పైన క్లిక్ చేసిన తరువాత కింది విధంగా OTP Validation పేజీ ఓపెన్ అవుతుంది. Terms & Conditions ఆప్షన్ పైన టిక్ చేసి, Generate Aadhaar OTP ఆప్షన్ పైన క్లిక్ చెయ్యాలి

STEP 6 : Generate Aadhaar OTP ఆప్షన్ పైన క్లిక్ చేసిన తరువాత మీ ఆధార్ తో లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ని ఎంటర్ చేసి, I agree to validate ఆప్షన్ పైన టిక్ చేసి, Continue పైన క్లిక్ చెయ్యాలి

STEP 7 : Continue పైన క్లిక్ చేసిన తరువాత మీ ఆధార్ కార్డు లోని వివరాలు (ఆధార్ నెంబర్, మీ ఫోటో, పేరు, అడ్రస్ Gender, email id మరియు మొబైల్ నెంబర్) చూపిస్తాయి

STEP 8 : మీ వివరాలు సరి చూసుకొని, I accept that ఆప్షన్ పైన టిక్ చేసి, Continue పైన క్లిక్ చెయ్యాలి

STEP 9 : ఒక వేళ మీ ఆధార్ కార్డు లో email id లేక పోతే కింది విధంగా ఇమెయిల్ వెరిఫికేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. లేదంటే నేరుగా STEP 10 పేజీ ఓపెన్ అవుతుంది

STEP 10 : పాన్ కార్డు అప్లికేషన్ సంబందించిన Aknowledgement Number చూపిస్తుంది. ఇది నోట్ చేసి పెట్టుకోండి. ఈ Aknowledgement Number పాన్ కార్డు స్టేటస్ చెక్ చెయ్యడానికి అవసరం అవుతుంది

మీ పాన్ కార్డు అప్లికేషన్ పూర్తి అయింది. e-PAN జెనెరేట్ అవ్వడానికి గంట సమయం పడుతుంది. మీ పాన్ కార్డు అప్లికేషన్ స్టేటస్ చెక్ చెయ్యడానికి పూర్తి ప్రాసెస్ కింద ఇవ్వడం జరిగింది

పాన్ కార్డు స్టేటస్ చెక్/డౌన్లోడ్ చేయు విధానం

STEP 1 : మీరు ముందుగా కింద ఇవ్వబడిన Income Tax e-Filing (Instant PAN Card Application Link) వెబ్‌సైట్‌ లింక్‌పై క్లిక్‌ చేయండి.

STEP 2: తరువాత Check Status / Download PAN ఆప్షన్ పైన క్లిక్ చెయ్యాలి

STEP 3: మొదటగా మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి, Continue పైన క్లిక్ చెయ్యండి.

STEP 4: క్లిక్ చేసిన తరువాత మీ ఆధార్ తో లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ని ఎంటర్ చేసి, Continue పైన క్లిక్ చెయ్యాలి

STEP 5: మొదటగా స్టేటస్ In Progress చూపిస్తుంది. వెరిఫికేషన్ పూర్తి అయిన తరువాత Download PAN ఏనెబుల్ అవుతుంది. ఈ ప్రక్రియకు దాదాపు గంట సమయం పడుతుంది

STEP 6: Download PAN ఏనెబుల్ అయిన తరువాత క్లిక్ చేస్తే, మీ పాన్ కార్డు డౌన్లోడ్ అవుతుంది

ఈ సులువైన స్టెప్స్ తో ఎటువంటి రుసుము (Fees) లేకుండా రోజుల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా పాన్ కార్డు కి అప్లై చేసుకోవచ్చు.

ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ మరియు ఫామిలీ మెంబెర్స్ తో షేర్ చేసుకోండి.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page