రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మరియు పలు రకాలు చేతివృత్తుల ప్రతి నెల పంపిణీ చేసే సామాజిక పెన్షన్లను ఆగస్టు 1 నుంచి 5వ తేదీ వరకు ఇంటింటికి వెళ్లి గ్రామ వార్డు వాలంటీర్లు పంపిణీ చేస్తున్నారు.
ఈనెల 62.77 లక్షల మందికి పంపిణీ
రాష్ట్రవ్యాప్తంగా 62,77,105 మంది లబ్ధిదారులకు 1729.23 కోట్లను గ్రామ వార్డు వాలంటీర్లు పంపిణీ చేస్తున్నారు. సోమవారమే ఈ అమౌంట్ సచివాలయాల వారీగా బ్యాంకులో జమ కాగా వీటిని withdraw చేసి పంపిణీ చేస్తున్నారు.
ఈసారి కూడా కొత్త పెన్షన్లు లేనట్లే
రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పెన్షన్ కు దరఖాస్తు చేసుకొని అర్హత సాధించినటువంటి లక్షన్నర మందికి జూలై నుంచి పెన్షన్ పంపిణీ చేస్తారని భావించినప్పటికీ వాయిదా పడటం జరిగింది. అయితే ఈ నెలలో అయినా పెన్షన్ వస్తుందని ఆశపడిన వారికి ఈసారి కూడా నిరాశే ఎదురైంది. ఈ నెలలో కూడా కొత్త పెన్షన్లు లేవు.
పెన్షన్ పంపిణీ సంబంధించి వాలంటీర్లకు కావాల్సిన యాప్, డాష్ బోర్డ్ మరియు ఇతర లింక్స్
పెన్షన్ పంపిణీ సంబంధించి వాలంటీర్లకు కావాల్సినటువంటి యాప్ లింక్స్ కింది పేజ్ లో పొందండి
– పెన్షన్ కానుక లేటెస్ట్ యాప్
– పెన్షన్ డివైస్ యాప్
– పెన్షన్ పంపిణీ డాష్ బోర్డు
– పెన్షన్ ఇమేజ్ అప్లోడ్ స్టేటస్
అన్ని కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి
Leave a Reply