జగనన్న సురక్ష పథకానికి సంబంధించి జూలై 1 నుంచి జూలై 31 వరకు నెల రోజులపాటు సురక్ష క్యాంపులను సచివాలయాల వారిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. ఈ పథకం ద్వారా సంక్షేమ పథకాలు మరియు సర్టిఫికెట్ల జారీకి సంబంధించి 11 రకాల సేవలను పూర్తి ఉచితంగా మరియు ఇతర సేవలను మరియు సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకున్న విషయం తెలిసిందే.
15004 సచివాలయాలలో సురక్ష కార్యక్రమాలు
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 15, 004 గ్రామ వార్డు సచివాలయం ద్వారా ఈ సురక్ష కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మండల స్థాయి అధికారులు రెండు టీమ్స్ గా ఏర్పడి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి వారం రోజులు ముందే వాలంటీర్లు ప్రతి ఇంటిని సందర్శించి అవగాహన నిర్వహించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అదేవిధంగా వీరికి టోకెన్ల జారీ మరియు సచివాలయం లో క్యాంప్ తేదీల వివరాలు తెలియపరచి ఆ రోజున వారికి సచివాలయంలో సమస్యలను పరిష్కరించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
కోటి మందికి సమస్యల పరిష్కారం
ఈ పథకం ద్వారా సాధించిన పురోగతిని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది
- రాష్ట్ర వ్యాప్తంగా 59 లక్షల కుటుంబాలకు చెందిన దాదాపు కోటి మందికి ప్రయోజనం చేకూర్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది
- ఇప్పటికే 93 లక్షల వినతులు పరిష్కారం, మిగిలినవి వివిధ దశల్లో
- 40.52 లక్షల మందికి కుల ధృవీకరణ పత్రాలు
- 38.52 లక్షల మందికి ఇన్కమ్ సర్టిఫికెట్లు
- 2.70 లక్షల మంది రైతులకు 1 B దృవీకరణ పత్రాలు
- ఇంకా ఇతర 11 రకాల సేవలకు సంబంధించి సత్వర పరిష్కారాలు మరియు సర్టిఫికెట్లు అందించినట్లు ప్రభుత్వం తెలిపింది.
జగనన్న సురక్ష ద్వారా మీకు ఏమైనా ప్రయోజనం కలిగిందా
జగనన్న సురక్ష పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి క్యాంపు ల ద్వారా మీకు ఏమైనా ప్రయోజనం కలిగిందా? అవును అయితే “అవును” అని ఇటువంటి ప్రయోజనం కలగకపోతే “లేదు” అని ఎంచుకోండి.
ఈ పోల్ అవగాహన కోసం నిర్వహించడం జరుగుతుంది.
Leave a Reply