ఈ ఏడాది కొత్త గా పెన్షన్ పంపిణీ పథకానికి సాధించిన వారికి ఆగస్ట్ నెల నుంచి పెన్షన్ పంపిణీ చేస్తారని భావించినప్పటికీ మరోసారి వాయిదా పడింది. ఈ నెల కూడా పెన్షన్ అమౌంట్ వీరికి సాంక్షన్ కాలేదు.
ఈ సారి కూడా పెన్షన్ లేనట్లే
పెన్షన్ పంపిణీ సంబంధించి ఈ ఏడాది దరఖాస్తు చేసుకొని అర్హత సాధించినటువంటి లక్షన్నర మందికి జూలై నెల నుంచి పెన్షన్ పంపిణీ చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించినప్పటికీ వాయిదా పడడం జరిగింది. అయితే కనీసం ఆగస్టు నెలలో అయినా పెన్షన్ పంపిణీ చేస్తారని ఆశించినటువంటి లబ్ధిదారులకు నిరాశ మిగిలింది.
ఈ నెలలో కూడా పెన్షన్ పంపిణీకి సంబంధించి కొత్త పెన్షన్లను సంబంధిత యాప్ లో సచివాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం పంపించలేదు. దీంతో వారికి ఇన్స్ట్రక్షన్స్ రాని కారణంగా ఆగస్టు నెలలో కూడా కొత్తగా పెన్షన్ అర్హత సాధించిన వారికి పెన్షన్ పంపిణీ ఉండదు.
కనీసం సెప్టెంబర్ నెల నుంచి అయినా ఈ పెన్షన్ పంపిణీ ప్రారంభిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే.
పెన్షన్ కానుకకు సంబంధించినటువంటి అన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింది లింక్ క్లిక్ చేయండి
Leave a Reply