Citizen outreach survey february guidelines

,

Below are the detailed guidelines for citizen and beneficiary outreach survey for the month of february

I. ట్రైబల్ వెల్ఫేర్ కు సంబంధించి ROFR పట్టాలు / DKT పట్టాల వివరాల నమోదు :
ప్రశ్న : ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చే ROFR పట్టాల / DKT పట్టాల కోసం మీకు తెలుసా?
సమాధానం : YES/NO
ప్రశ్న :మీరు ROFR పట్టాల / DKT పట్టాల లబ్ధిదారులా ?
సమాధానం : YES/NO
ప్రశ్న : మీరు ROFR పట్టాల లబ్ధిదారులు అయితే ఫిజికల్ కాపీ అందిందా?
సమాధానం : YES/NO


II. హౌస్ ఓల్డ్ డేటా కు సంబంధించి స్వీకరించవలసిన వివరాలు :
ప్రశ్న : డేటాబేస్ లో చూపిస్తున్న టువంటి భూమి వివరాలు(WET /DRY LAND) కరెక్టా కాదా?
సమాధానం : YES/NO
ప్రశ్న : మీ ఇంటికి కనెక్ట్ చేయబడిన సర్వీస్ మీటర్ డేటాబేస్ లో చూపిస్తున్న టువంటి సర్వీస్ నెంబర్ కు సరిపోయిందా లేదా?
సమాధానం : YES/NO
ప్రశ్న : టాక్సీ కాకుండా డేటాబేస్ లో చూపిస్తున్న నాలుగు చక్రాల వాహనము వివరాలు సరిపోతాయా లేదా?
సమాధానం : YES/NO


III. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సర్వే :
ప్రశ్న : బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు లింక్ చెయ్యటం కోసం మీకు అవగాహన ఉందా?
సమాధానం : YES/NO
ఇక నుంచి సంక్షేమ పథకాల మొత్తమును ఎటువంటి అకౌంట్ నంబర్లు తీసుకోకుండా/నమోదు చేయకుండానే, లబ్దిదారుల ఆధార్ లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్ లలో (Through NPCI) జమ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం.
1. ఆధార్ ఆధారిత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్‌లు అనేది బ్యాంక్ వివరాలను తీసుకోకుండా నేరుగా లబ్ధిదారుల యాక్టివ్ ఖాతాకు నగదు పథక ప్రయోజనాలను బదిలీ చేసే విధానం.
2. ఆధార్ ఆధారిత DBT కోసం, లబ్ధిదారులు తమ ఆధార్ సీడెడ్ యాక్టివ్ బ్యాంక్ ఖాతాను NPCIతో మ్యాప్ చేయాలని భావిస్తున్నారు.
3. ప్రతి ఆధార్ సంఖ్య యొక్క ప్రస్తుత స్థితి. “యాక్టివ్”, “ఇనాక్టివ్” & “మ్యాప్ చేయబడలేదు”గా చూపిస్తుంది.
Q)బ్యాంక్ ఖాతాతో ఆధార్‌ను లింక్ చేయాల్సిన అవసరం ఉందని మీకు తెలుసా?
Ans: అవును b.లేదు
CASE-1:-యాక్టివ్ స్టేటస్ అంటే, ఆధార్ NPCI తో మ్యాప్ చేయబడింది మరియు డైరెక్ట్ బెనిఫిట్ బదిలీలకు అర్హమైనది.
CASE-2 :-ఇది “ఇన్‌యాక్టివ్ ఆధార్ ఎర్రర్” అయితే, కారణాలు మరియు ఎలా యాక్టివేట్ చేయాలి?
Q: ఇన్‌యాక్టివ్ ఆధార్ కార్డ్ కారణాలు ఏమిటి?
a. బాల్ ఆధార్ తప్పనిసరిగా 5 సంవత్సరాలు మరియు 15 సంవత్సరాల తర్వాత తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్‌డేట్ చేయాలి. లేకుంటే, అది స్వయంచాలకంగా నిష్క్రియం అవుతుంది.
b. గుర్తింపు రుజువుగా 5-10 సంవత్సరాలు ఆధార్ కార్డును ఉపయోగించకపోతే.
Q: ఇనాక్టివ్ ఆధార్ కార్డ్‌ని ఎలా యాక్టివేట్ చేయాలి?
జ: eKYC ఆధార్ కార్డ్ స్థితిని అప్‌డేట్ చేయడం ద్వారా ఇన్‌యాక్టివ్ నుండి యాక్టివ్ గా మారుతుంది.
CASE-3 :- Q. “నాట్ మ్యాప్ చేయబడిన ఆధార్” లోపం అయితే, కారణాలు మరియు ఎలా యాక్టివేట్ చేయాలి? “నాట్ మ్యాప్ చేయని ఆధార్ కార్డ్”కి కారణం ఏమిటి?
A: NPCIతో ఆధార్ కార్డ్‌ను మ్యాప్ చేయడానికి బ్యాంక్‌లో సమ్మతి ఫారమ్ ఇవ్వబడలేదు.
Q: బ్యాంక్‌తో ఆధార్ కార్డ్‌ను మ్యాప్ చేయడం ఎలా?
A: NPCIతో ఆధార్‌ను మ్యాప్ చేయడానికి బ్యాంక్ వద్ద సమ్మతి పత్రాన్ని సమర్పించడం.

పౌరులతో మాట్లాడవలసిన అంశములు (Talking Points)

1. VSWS బృందం కేటాయించిన ప్రజలందరికీ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ & వాలంటీర్ల వ్యవస్థల స్థాపన యొక్క ప్రాముఖ్యతను వివరించాలి. ఈ వ్యవస్థలను ఏర్పాటు చేసిన ఉద్దేశాలను అందరికీ అర్థమయ్యేలా తెలియజేయాలి. గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ & వాలంటీర్ల వ్యవస్థలు ప్రవేశపెట్టక ముందు ఉన్న పాలనా పరమైన స్థితిగతులను వివరిస్తూ నేటి వ్యవస్థల పనితీరును వివరించాలి.
2. ప్రజలందరూ తప్పనిసరిగా వారి ప్రాంతంలోని సచివాలయం గురించి తెలుసుకోగలగాలి. VSWS బృందం వారి పరిధిలోని ప్రతి ఒక్కరినీ సచివాలయ వ్యవస్థ గురించి తెలుసా? లేదా? అని అడగాలి
3. VSWS బృందం ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన 4 పథకాల (పెన్షన్లు, బియ్యం కార్డులు, ఆరోగ్యశ్రీ, గృహనిర్మాణం)గురించి ప్రజలకు వివరించాలి. ప్రజలందరూ సంతృప్తి చెందేలా సచివాలయం అందించే అన్ని సంక్షేమ పథకాలు/సేవల యొక్క అమలు విధానం మరియు SLA వ్యవధిని గురించి తెలియజేయాలి.
4. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాల లబ్ధి చేకూరుతున్నదా? ఉదా: కుటుంబంలోని సభ్యులలో పిల్లలకు అయితే జగనన్న విద్యా దీవెన, అమ్మఒడి… వృద్ధులు ఉన్నట్లైతే పింఛను, వ్యవసాయదారులైతే రైతుభరోసా తదితర పథకాలు అందుతున్నాయో, లేదో అడిగి రాసుకోవాలి.
5. కుటుంబంలోని సభ్యులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు గురించి ఎంత మేరకు అవగాహన ఉన్నదో అడిగి తెలుసుకోవాలి. అర్హతలున్నప్పటికీ ఏదైనా పథకం యొక్క ప్రయోజనాలను పొందలేకపోతున్నారా? లాంటి వివరాలను పరస్పరం తనిఖీ చేయాలి.
6. అర్హతలున్నప్పటికీ ఏదైనా పథకం యొక్క ప్రయోజనాలను పొందని లబ్ధిదారులను గుర్తించి, వారితో సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా మాట్లాడవలెను.
7. ఫిర్యాదుల పరిష్కారానికై ప్రభుత్వాన్ని సంప్రదించడానికి ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ 1902 మరియు స్పందన వ్యవస్థల గురించి ప్రజలందరికీ VsWS బృందం అవగాహన కల్పించాలి. ప్రభుత్వ పథకాలు, పౌర సౌకర్యాలకు సంబంధించిన గ్రీవెన్స్ గురించి ఫిర్యాదులను ఎలా నమోదు చేయాలి, VSWSతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఎప్పుడు సంప్రదించాలి అనే విషయాల పట్ల అవగాహన కల్పించాలి.
8. ప్రజలకు తమ సచివాలయంలో ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు స్పందన కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలియాలి.
9. CSC ద్వారా సచివాలయం అందించే అన్ని సేవల గురించి ప్రజలందరికీ వివరించాలి. ఉదాహరణకు విద్యుత్ బిల్లులు, ఆధార్ సేవలు (భవిష్యత్తులో) మొదలైనవి.
10. 1902, 100, 104, 108 వంటి ముఖ్యమైన సంప్రదించవలసిన నంబర్ గురించి మరియు అవి దేనికి ఉపయోగించబడుతున్నాయనే దాని గురించి తప్పనిసరిగా వివరించాలి.
11. దిశా యాప్ యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలి. మరియు యాప్ లోని ప్రతి ఫీచర్, దానిని ఎలా ఉపయోగించాలి మరియు అత్యవసర పరిస్థితుల్లో ఇది ఎలా ఉపయోగపడుతుందో అర్థమయ్యేలా వివరించాలి.
12. హౌస్ హో కేటాయించిన వాలంటీర్ మరియు వారి సెక్రటేరియట్ సిబ్బంది పనితీరు గురించి ప్రజల నుండి తప్పనిసరిగా అభిప్రాయాలను సేకరించాలి.

గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది నిర్వహించవలసిన బాధ్యతలు

1. సిటిజన్ ఔట్ రీచ్ క్యాంపెయిన్ లో భాగంగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వారి పరిధి లోని కుటుంబాలను సంబంధిత గ్రామ! వార్డు వాలంటీర్ తో పాటుగా సందర్శించవలెను. క్యాంపెయిన్ నిర్వాహకుని గా ప్రజలకు పరిచయం చేసుకోవలెను.
2. సిటిజన్ ఔట్ రీచ్ క్యాంపెయిన్ నిర్వహణలో పాల్గొనే సిబ్బంది వారి మరియు సంబంధిత ఇతర కార్యదర్శులు నిర్వర్తించవలసిన విధులు మరియు బాధ్యతలను వివరించవలెను.
3. ప్రభుత్వ సంక్షేమ పథకాల క్యాలెండర్ గురించి ప్రజలకు వివరించవలెను.
4. సిటిజన్ ఔట్ రీచ్ క్యాంపెయిన్ ఉద్దేశాన్ని ప్రజలకు వివరించి, గ్రామ వార్డు సచివాలయం లో లభించే విభిన్న ప్రభుత్వ సేవలను ఉపయోగించుకోవలసినదిగా ప్రజలకు మార్గనిర్దేశకత్వం చేయవలెను.
5. ప్రభుత్వ సంక్షేమ పధకాల క్యాలెండర్ మరియు సచివాలయ సిబ్బంది యొక్క వివరాలతో కూడిన కరపత్రాన్ని ప్రజలందరికీ అందజేయవలెను.
6. గ్రామ/వార్డు వాలంటీర్ల పనితీరు పై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించవలెను.
7. యాప్ లోని ప్రశ్నావళిని గ్రామ! వార్డు సచివాలయ సిబ్బంది పూర్తి చేయవలెను.
8. ప్రభుత్వ పథకాలు మరియు సేవల దరఖాస్తు ప్రక్రియలో ప్రజలు ఎదుర్కోంటున్న సమస్యలను వివరంగా సేకరించవలెను.
9. ప్రభుత్వ పథకాల లబ్ధికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం నిరభ్యంతరంగా సచివాలయాన్ని సందర్శించమని కోరాలి. వారి సమస్యల పరిస్కారం కోసం తాము ఉన్నాము అనే భరోసా కల్పించాలి .
10. పౌరుల ఫోటోని క్యాప్చర్ చేసి, తమ విలువైన సమయాన్ని కేటాయించి ‘ఔట్ రీచ్ కాంపెయిన్’ లో పాల్గొని సహకరించినందుకు అభినందిస్తూ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపవలెను.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page