AP Govt Key Decisions on Agricultural developments – Rythu bharosa on May 16

,
AP Govt Key Decisions on Agricultural developments – Rythu bharosa on May 16

Govt of AP had taken key decisions w.r.to Agricultural sector and it’s ongoing schemes for the year 2022-23.

వ్యవసాయ శాఖపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష..కీలక నిర్ణయాలు

  • ఆర్బీకేల్లో ఈ ఏడాది నుంచే వాటి వినియోగం: సీఎం జగన్‌
  • మందుల పిచికారీ.. ఎరువుల వినియోగం వాటితోనే డ్రోన్ల నిర్వహణపై రైతన్నలకు శిక్షణ.. సర్టిఫికెట్లు 
  • మే 16న రైతు భరోసా.. జూన్‌ 15లోగా పంటల బీమా
  •  జూన్‌లోనే 3 వేల ట్రాక్టర్ల పంపిణీ
  • రైతులకు వ్యక్తిగత యంత్ర పరికరాలు అందించేలా కార్యాచరణ
  • కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులపై ఇంటింటికీ వెళ్లి అవగాహన 
  • ఆర్బీకేల్లో ఇన్‌పుట్స్‌కు స్టోరేజీ గదులు
  • వర్సిటీల ద్వారా విద్యార్థులకు ఆర్బీకేల్లో ఆర్నెల్ల ఇంటర్న్‌షిప్‌ 
  • రైతు భరోసా కేంద్రాలు ఐరాస అవార్డుకు నామినేట్‌ కావడంపై సీఎం అభినందనలు 

 వీడియోలతో అవగాహన..
విద్యావంతులైన రైతులతో ప్రత్యేకంగా డ్రోన్‌ కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేసి మాస్టర్‌ ట్రైనర్స్‌ ద్వారా శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్‌ జారీ చేయాలి. డ్రోన్లతో పురుగు మందుల స్ప్రే, ఎరువులను వినియోగించడంపై వీడియోల ద్వారా ఆర్బీకేల స్థాయిలో రైతులకు విస్తృత అవగా>హన కల్పించాలి. 

రైతులకు వ్యక్తిగత యంత్ర పరికరాలు…
రైతులకు ఈ ఏడాది నుంచి సబ్సిడీపై వ్యక్తిగతంగా వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీకి కార్యాచరణ సిద్ధం చేయాలి. ఆర్బీకేలకు అనుబంధంగా ఏర్పాటైన సీహెచ్‌సీలు, క్లస్టర్‌ సీహెచ్‌సీల్లో ఉన్న యంత్రాలు కాకుండా డిమాండ్‌ సర్వే ఆధారంగా చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యతనిస్తూ సబ్సిడీపై పరికరాలు అందించేలా ప్రణాళిక రూపొందించాలి. జూన్‌ మొదటి వారంలో 3 వేల ట్రాక్టర్లను అందచేయాలి. 4,014 ఆర్బీకే స్థాయి సీహెచ్‌సీ కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు ప్రారంభించాలి. 402 కంబైన్డ్‌ హార్వెస్టర్లతో కూడిన క్లస్టర్‌ స్థాయి సీహెచ్‌సీలను కూడా ప్రారంభించాలి. 

 రైతు చేతికి పెట్టుబడి సొమ్ము
ఖరీఫ్‌ సీజన్‌ నాటికి రైతుల చేతిలో పెట్టుబడులు పెట్టేలా కార్యాచరణ ఉండాలి. మే 16న వైఎస్సార్‌ రైతు భరోసా, జూన్‌ 15లోగా పంటల బీమా పరిహారం రైతులకు చెల్లించాలి. దీనివల్ల ఖరీఫ్‌ సీజన్‌ నాటికి రైతుల చేతిలో పెట్టుబడులు పెట్టినట్లు అవుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ రైతు భరోసా అందేలా చర్యలు తీసుకోవాలి. సీజన్‌కు ముందుగానే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచాలి. ఎక్కడా స్టాక్‌ లేదన్న సమాధానం ఆర్బీకేల్లో వినిపించడానికి వీల్లేదు. ఆర్బీకేల నుంచి జిల్లా స్థాయి వరకూ వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ రూపొందించాలి. ఆర్బీకేల్లో ఇన్‌పుట్స్‌ కోసం స్టోరేజీ గదులు నిర్మించేలా చర్యలు తీసుకోవాలి. ఆర్బీకేల స్థాయిలో ప్రకృతి, సహజ వ్యవసాయ సాగును ప్రోత్సహించేలా సీహెచ్‌సీ ఏర్పాటు చేయాలి.

ఆర్బీకేల్లో విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌
‘ఆర్బీకేలు, ఇ– క్రాపింగ్‌ మిళితం చేయాలి. ఆర్బీకేల కార్యకలాపాలు సమర్థంగా, పారదర్శకంగా ఉండాలి. పంటల బీమా నుంచి ప్రతి పథకానికి సంబంధించి లబ్ధిదారుల జాబితాను సోషల్‌ ఆడిట్‌లో భాగంగా ఆర్బీకేల్లో ప్రదర్శించాలి. సీఎం యాప్‌ పనితీరుపై నిరంతరం పర్యవేక్షించాలి. పంటలకు ఎక్కడైనా మద్దతు ధర లభించకుంటే అధికారులు వెంటనే స్పందించి ఆదుకోవాలి. ఆర్బీకేల్లో కియోస్క్‌లు సమర్థవంతంగా పనిచేయాలి. ప్రతీ ఆర్బీకేలో బ్యాంకింగ్‌ కరస్పాండెంట్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలి. యూనివర్సిటీల ద్వారా విద్యార్థులు ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌ను ఆర్బీకేల్లో పూర్తి చేసేలా కోర్సులను రూపొందించాలని గతంలోనే సూచించాం. విద్యార్థుల పరిశీలన, సలహాలు ఆర్బీకేల పనితీరును మెరుగుపర్చేందుకు దోహదం చేస్తాయి.

నా తరపున లేఖలు పంపండి..
కౌలు రైతులకు సీసీఆర్సీ (క్రాప్‌ కల్టివేటర్‌ రైట్స్‌ కార్డు) జారీపై అవసరమైతే భూ యజమానుల ఇళ్ల వద్దకు వెళ్లి అవగాహన కల్పించాలి. సీసీఆర్సీ వల్ల భూ యజమానుల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదని వివరించాలి. ఈమేరకు అన్ని వివరాలతో ముఖ్యమంత్రిగా నా తరఫున వారికి లేఖలు పంపాలి. సాధ్యమైనంత ఎక్కువ మందికి సీసీఆర్సీలు జారీ చేయడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను కౌలు రైతులకు అందచేయాలి.

చిరుధాన్యాల సాగుకు ప్రోత్సాహం
రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన మిల్లెట్‌ పాలసీకి అనుగుణంగా చిరుధాన్యాలు సాగును ప్రోత్సహించాలి. చిరు ధాన్యాలకు మద్దతు ధర, ప్రాసెసింగ్, అదనపు విలువ జోడించడం, వినియోగం పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించి పూర్తి స్థాయిలో కార్యాచరణ సిద్ధం చేయాలి. నీటి వసతి అరకొరగా ఉన్న ప్రాంతాల్లో పంట మార్పిడిని ప్రోత్సహించేలా ప్రణాళిక రూపొందించాలి.

వేసవిలో రికార్డు స్థాయి పంట
గతంలో ఎన్నడూలేని విధంగా రాష్ట్రంలో పదేళ్ల తర్వాత వేసవి పంట (మూడో పంట)కు అనుకూల పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు వెల్లడించారు. వేసవి పంట గతేడాది 13 వేల హెక్టార్లలో సాగు కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ 66,803 హెక్టార్లలో సాగు జరుగుతోందని తెలిపారు. గతేడాదితో పోలిస్తే 477 శాతం విస్తీర్ణం పెరిగిందని, ఈసారి కనీసం లక్ష హెక్టార్లు దాటుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడుల్లో నాలుగు శాతం అదనంగా నమోదైనట్లు తెలిపారు. ఖరీఫ్‌–2022 సీజన్‌కు సరిపడా ఎరువులతో పాటు ఆర్బీకేల స్థాయిలో విత్తనాలు అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు. ఇప్పటికే 6 లక్షల టన్నుల ఎరువులను నిల్వ చేశామన్నారు. 

త్వరలో రాష్ట్రవ్యాప్తంగా మీటర్లు
వ్యవసాయ ఉచిత విద్యుత్తు కనెక్షన్లకు మీటర్లు అమర్చే పైలట్‌ ప్రాజెక్టు శ్రీకాకుళం జిల్లాలో విజయవంతమైందని అధికారులు తెలిపారు. మీటర్ల వల్ల రైతులకు నాణ్యమైన కరెంటు అందడంతోపాటు విద్యుత్తు సిబ్బందిలో జవాబుదారీతనం పెరుగుతుందని సీఎం పేర్కొన్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు అమర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై ఆర్బీకేల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి రైతులకు జరిగే మేలును వివరించాలని సూచించారు.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page