అమరావతి CRDA పరిధిలో మే 26 న రాష్ట్ర ప్రభుత్వం సెంటు పట్టా భూములను హుటా హుటిన చదును చేసి పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఇందుకు కొనసాగింపుగా అదే ప్రాంతంలో నేడు 50793 ఇళ్లకు సంబంధించి శంకు స్థాపన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు.
ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన
జూలై 24న సీఎం అమరావతి సిఆర్డిఏ పరిధిలోని 50793 ఇళ్ల నిర్మాణాల కు సీఎం శంకుస్థాపన చేశారు.
సోమవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కృష్ణయ్యపాలెం హౌసింగ్ లేఅవుట్ కు ముఖ్యమంత్రి చేరుకోవడం జరిగింది. వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనంతరం ఇళ్ల నిర్మాణాలకు సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఆంధ్ర ప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ EWS లేఔట్ల లో 18,29.57 కోట్ల వ్యయంతో ప్రభుత్వం ఈ నిర్మాణాలను చేపడుతుంది. వీటిని ఆరు నెలల్లో పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
రికార్డు టైం లో పనులు
రాష్ట్రవ్యాప్తంగా మునుపెన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం కోర్టు అడ్డంకులు తొలగిన వెనువెంటనే రాజధాని ప్రాంతం, ఆర్ 5 జోన్ లో స్థలాలను కేటాయించడం మరియు వాటి నిర్మాణాలకు సంబంధించి శంకుస్థాపనలు చేయడం వంటివి 2 రోజుల్లోనే రికార్డు టైం లో జరిగిపోవడం గమనార్హం.
లేఅవుట్ల లో 1371.41 కోట్ల వ్యయంతో ఉచితంగా 50793 ఇళ్లను నిర్మిస్తుండగా, మౌలిక సదుపాయాల కల్పన కు మరో 384.42 కోట్ల వ్యయం అవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Leave a Reply