అమరావతి CRDA పరిధిలో కోర్టులలో అడ్డంకులు తొలగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిన పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో పది రోజుల్లోనే పేదలకు స్థలాలను కేటాయించిన విషయం తెలిసిందే.
అదే జోరుతో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి అధ్యక్షతన ఇళ్ల నిర్మాణాలు కూడా చేపట్టబోతుంది.
జూలై 24న ముఖ్యమంత్రి ద్వారా ప్రారంభం
జూలై 24న సీఎం అమరావతి సిఆర్డిఏ పరిధిలో పర్యటించనున్నారు. ఇటీవల ఇళ్ల స్థలాలు కేటాయించిన వారికి హుటాహుటిన ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వం చేపడుతుంది. ఇందుకు సంబంధించినటువంటి శంకుస్థాపనను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.
సోమవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కృష్ణయ్యపాలెం హౌసింగ్ లేఅవుట్ కు ముఖ్యమంత్రి చేరుకోవడం జరుగుతుంది. వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం ఇళ్ల నిర్మాణాలకు సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
నెల రోజుల్లో రికార్డు స్థాయిలో కార్యక్రమం
రాష్ట్రవ్యాప్తంగా మునుపెన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం కోర్టు అడ్డంకులు తొలగిన వెనువెంటనే రాజధాని ప్రాంతం, ఆర్ 5 జోన్ లో స్థలాలను కేటాయించడం మరియు వాటి నిర్మాణాలకు సంబంధించి శంకుస్థాపనలు చేయడం వంటివి నెల రోజుల్లోనే రికార్డు టైం లో జరిగిపోవడం గమనార్హం.
ఇదే వేగంతో ఇళ్ల నిర్మాణాలను కూడా చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తద్వారా ఇల్లు నిర్మాణం అయితే ఇక కోర్టుల నుంచి ఎక్కువ ఆటంకాలు కలిగే అవకాశం ఉండదు. ఆరు నెలల్లో ఇళ్ల నిర్మాణాల ను పూర్తి చేస్తామని ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు సజ్జల వెల్లడించారు.
Leave a Reply