బ్యాంకులకు ఐదు రోజుల పని దినాలను కల్పించి వారాంతంలో ఐటీ ఉద్యోగుల తరహాలోనే రోజుల సెలవు దినాలను కల్పించాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని నెలలుగా బ్యాంక్ యూనియన్ లో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ప్రస్తుతం ఐబీఏ ఈ ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచినట్లు సమాచారం.
త్వరలో ఐదు రోజుల పని దినాలు
ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఇప్పటికే ఐదు రోజుల పని దినాల ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచినట్లు United forum of bank unions UFBU తెలిపింది.
అదేవిధంగా త్వరితగతన ఇందుకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలని, మరింత ఆలస్యం చేయరాదని IBA ను కోరినట్లు UFBU తెలిపింది.
ఆ రోజున కీలక నిర్ణయం
యూనియన్ల నుంచి వస్తున్నటువంటి డిమాండ్లను పరిగణలోకి తీసుకున్నటువంటి IBA, జూలై 28వ తేదీ జూన్ నెలలతో సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయం తీసుకోనుంది. అయితే ఐదు రోజుల పని దినాలు ఉన్నప్పుడు ప్రతిరోజు 40 నిమిషాలు అదనంగా పనిచేయాల్సి ఉంటుందని ఇప్పటికే IBA యూనియన్లకు తెలపడం జరిగింది.
Leave a Reply