రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో టాక్సీ ఉన్నటువంటి డ్రైవర్లకు వైయస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా ప్రతి ఏటా పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. 2023 ఏడాదికి సంబంధించి వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని ఆగస్టు నెలలో ప్రభుత్వం ప్రారంభించనున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ కొనసాగుతున్నాయి.
వైయస్సార్ వాహన మిత్ర గడువు జూలై 25 పెంపు
వైయస్సార్ వాహన మిత్ర అప్లికేషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం జూలై 20 నుంచి 25 వరకు పొడిగించడం జరిగింది. కొత్తగా ఎవరైనా వైయస్సార్ వాహన మిత్ర కి అప్లై చేసుకోవాలనుకుంటే మీ సచివాలయంలో సంప్రదించవచ్చు.
ఎవరైతే లబ్ధిదారులు తమ వాహనాన్ని అమ్ముకొని కొత్త వాహనం కొంటారో వారికి న్యూ వెహికల్ పైనే అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా లబ్ధిదారులకి సంబంధించి వాహనం రిజిస్ట్రేషన్ లేదా లైసెన్స్ ఎక్స్పైర్ అయితే వారికి కూడా దరఖాస్తు తీసుకోవాల్సి ఉంటుంది. ధ్రువీకరణ అనేది 6 అంచెల ధ్రువీకరణ స్థాయిలో జరుగుతుంది.
ఆల్రెడీ వైయస్సార్ వాహన మిత్ర పథకానికి పొందుతున్నటువంటి లబ్ధిదారులు మరోసారి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. పాత లబ్ధిదారుల వెరిఫికేషన్ సచివాలయాల స్థాయిలో కొనసాగుతుంది.
కొత్త లబ్ధిదారులకు క్యాస్ట్ మరియు ఆదాయ దృవీకరణ పత్రాలు(income )తప్పనిసరి. అయితే పాత వారికి ఇవి తప్పనిసరి కాదు.
వాహన మిత్ర పాత లబ్ధిదారులకు కీలక సూచనలు
పాత లబ్ధిదారులకు సంబంధించి సచివాలయం ప్రారంభం అయింది. డ్రైవర్లు తమ లైసెన్స్, బండి డాక్యుమెంట్స్ వంటివి అన్ని ఎక్స్పైర్ కాకుండా చూసుకోండి.
ఆరు అంచెల దృవీకరణకు సంబంధించి మీ వ్యాలిడేషన్ ని కింది లింక్ ద్వారా చెక్ చేసుకోండి.
వైయస్సార్ వాహన మిత్ర అప్లికేషన్ స్టేటస్ కింది ప్రాసెస్ ద్వారా చెక్ చేయండి
కింది లింకు ద్వారా వైయస్సార్ వాహన మిత్ర అప్లికేషన్ స్టేటస్ ను చెక్ చేయవచ్చు. ఇదే లింకులో అమౌంట్ విడుదల చేసిన తర్వాత పేమెంట్ స్టేటస్ కూడా మీరు చెక్ చేయవచ్చు
Leave a Reply