గ్రేటర్ హైదరాబాద్ GHMC పరిధిలో జూలై 21, 22 తేదీలలో సెలవులను ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది.
విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు
రానున్న వారం రోజులు తెలంగాణలో వర్షాలు కొనసాగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జూలై 21 22 తేదీలలో జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి అన్ని విద్యాసంస్థలు మరియు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులను ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వైద్యం, పాలు వంటి అత్యవసర సర్వీసులకు మాత్రం మినహాయింపు ఇవ్వటం జరిగింది. ప్రజల అవసరమైతే తప్ప బయటకు రావద్దని తెలిపింది.
అదేవిధంగా ప్రైవేట్ సంస్థలు కూడా ఉద్యోగులకు ప్రకటించేలా చూడాలని కార్మిక శాఖకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్
జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులకు రెండు రోజులపాటు ఇంటి నుంచి పని చేసేలా work from home సదుపాయాలు కల్పించాలని ఐటి కంపెనీలను ఆదేశించింది.
అటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హైటెక్ సిటీ వెళ్ళే దారుల్లో పలుచోట్ల నీరు ఆగుతుండడం, ట్రాఫిక్ జామ్ అవుతున్న నేపథ్యంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
రానున్న వారం రోజులు వర్షాలు
తెలంగాణ లో మరో వారం రోజులపాటు వర్షాలు ఉంటాయని రాష్ట్ర వాతావరణ శాఖ తెలిపింది. జూలై 21 22 తేదీలలో పలుచోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు, రానున్న మూడు నుంచి నాలుగు రోజులు మాత్రం వర్షాలు మెండుగానే ఉంటాయని తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో మరి కొన్ని రోజులు వర్షాలు కొనసాగుతాయి. గత 24 గంటల్లో 17 నుంచి 19 సెం. మీ వర్షపాతం పడినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రైతులకు ఈ వర్షాలు మేలు చేయనున్నట్లు సమాచారం. అయితే ప్రజలు మాత్రం అవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రభుత్వం పేర్కొంది.
Leave a Reply