జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించి చెల్లింపులు చాలా ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. నిధులు విడుదల చేసిన 3 వ వారం నుంచి ప్రతి రోజూ కొంత మంది లబ్ధిదారుల చప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ వస్తుంది. కొంత మందికి ఇంకా అమౌంట్ పడాల్సి ఉండగా, కొందరికి మాత్రం పూర్తి అమౌంట్ పడలేదు. దీనికి ప్రభుత్వం ఎం క్లారిటీ ఇచ్చింది ఎప్పుడు పడతాయో చూద్దాం.
ఇది చదవండి: అమ్మ ఒడి అమౌంట్ అందరికీ జమ..చెక్ చేయండి
పూర్తి 13000 జమ కాలేదా
అమ్మ ఒడి నిధులు ఇప్పటికే ఆలస్యం అవ్వగా, పలువురికి ఇంకా అమౌంట్ జమ కావాల్సి ఉంది. అయితే కొందరికి మాత్రం అమౌంట్ పడింది కానీ పూర్తి అమౌంట్ కాదు.
కొంత మందికి 4000 , 5000 ఇంకొందరికి 9000 జమ అయినట్లు తెలుస్తోంది.
ఇందుకు నిర్దిష్ట మైన కారణం లేదా ఎందుకు ఆలస్యం అయింది అనే దాని పైన ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి క్లారిటీ లేదు. అయితే ఎప్పుడు అమౌంట్ పడుతుంది అనే విషయానికి సంబంధించి మాత్రం ప్రభుత్వ వర్గాలు కొంత సమాచారం మాత్రం ఇవ్వడం జరిగింది.
త్వరలోనే పూర్తి అమౌంట్ విడుదల
ఎవరికి అయితే అర్హత ఉన్నా అమౌంట్ పాక్షికంగా, లేదా అసలు పడలేదో అటువంటి వారికి త్వరలోనే పూర్తి అమౌంట్ ఆయా కార్పొరేషన్ల ద్వారా విడుదల చేయనున్నట్లు తెలిపింది.
అయితే ఈ వారంలో అసలు పడని మరి కొంత మందికి పాక్షికంగా అమౌంట్ జమ చేసి ఈ నెలాఖరు కి పూర్తి అమౌంట్ జమ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే గత వారం ఆతర్వాత ఈ వారంలోగా అందరికీ అమౌంట్ జమ చేస్తామని తెలిపిన ప్రభుత్వం మరలా కొంత మందికి వచ్చే వారానికి వాయిదా వేస్తుందా అనేది చూడాలి.
అమ్మ ఒడి పేమెంట్ స్టేటస్ ఇలా చెక్ చేయండి
కింది లింకు లో మీరు ఆన్లైన్లో అమ్మ ఒడి ఏ విధంగా చెక్ చేయవచ్చు అదేవిధంగా చెక్ చేసే లింక్ ఇవ్వబడ్డాయి. మీకు అప్లికేషన్ స్టేటస్ లో Eligible అని పేమెంట్ స్టేటస్ లో సక్సెస్ అని చూపిస్తుంది.
గమనిక : ప్రస్తుతం అమౌంట్ పడిన వారికి కింది విధంగా రెండు సక్సెస్ రికార్డులు చూపిస్తుంది.
కొంతమందికి పేమెంట్ సక్సెస్ చూపించినప్పటికీ ఇంకా అమౌంట్ ఖాతాలో జమ కాలేదు. అటువంటివారు మీ సచివాలయంలో సంప్రదించండి. అదేవిధంగా మీ బ్యాంక్ ఖాతా యాక్టివ్ లో ఉందో లేదో, మీ బ్యాంక్ ఆధార్ కి npci మ్యాపింగ్ జరిగిందో లేదో చెక్ చేసుకోండి. బ్యాంక్ ఆధార్ NPCI Mapping status కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Leave a Reply