రాష్ట్ర వ్యాప్తంగా వీధి వ్యాపారులకు ప్రతి ఏడాది ఆర్థిక సాయం అందిస్తున్నటువంటి జగనన్న తోడు పథకానికి సంబంధించి వరుసగా నాలుగో ఏడాది తొలి విడత అమౌంట్ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి ఈరోజు వర్చువల్ గా విడుదల చేయడం జరిగింది.
వరుసగా నాలుగో ఏడాది మొదటి విడత అమౌంట్
రాష్ట్ర వ్యాప్తంగా 5,10,412 మంది చిరు వ్యాపారులకు పదివేల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ వడ్డీ లేని రుణాలు మరియు వడ్డీ రియంబర్స్మెంట్ మొత్తం కలిపి 560.73 కోట్లను ఈరోజు బటన్ నొక్కి ముఖ్యమంత్రి లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగింది.
ఏడాది 549.70 కోట్లను వడ్డీలేని రుణాల కింద మరియు 11.03 కోట్ల ను వడ్డీ రియంబర్స్మెంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసి జమ చేయడం జరిగింది. వడ్డీ అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది.
జగనన్న తోడు పథకం గురించి షార్ట్ గా మీకోసం.
వీధీ వ్యాపారాలు , సంప్రదాయ చిరు వ్యాపారులకు ఈ పథకం ద్వారా ₹10000 , తదుపరి ఏడాది నుంచి ₹20 లేదా ₹30 వేల ఆర్ధిక ఋణం లభిస్తుంది. బ్యాంకుల ద్వారా ఈ ఋణం మంజూరు చేస్తారు.
బ్యాంకులు 7% వడ్డీ తో ఈ రుణాలను మంజూరు చేస్తాయి.
సకాలంలో రుణాలు తిరిగి చెల్లించిన వారికి ప్రభుత్వం వడ్డీ రాయితీ అమౌంట్ ని తిరిగి వారి బ్యాంక్ ఖాతా లో ఏటా రెండుసార్లు జమ చేస్తుంది.
జగనన్న తోడు పీఎం స్వనిధి తో అనుసంధానం
పీఎం స్వనిది పథకం కింద కేంద్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో వీధి వ్యాపారాలు చేసుకుంటున్న వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.
దీనికి అదనంగా పల్లె ప్రాంతాల్లో కూడా చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని తోడు ద్వారా అందిస్తుంది.
కాబట్టి ఈ పథకం ద్వారా అమౌంట్ పొందే వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఉంటుంది. వడ్డీ రాయితీ అమౌంటును కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం తమ పరిధిలో ఉన్నటువంటి లబ్ధిదారులకు తిరిగి జమ చేస్తుంటాయి.
జగనన్న తోడు పేమెంట్ స్టేటస్ ఎలా చూడాలి
లబ్ధిదారులు తమ రుణానికి సంబంధించినటువంటి అప్లికేషన్ స్టేటస్ ను కింది లింక్ ద్వారా చెక్ చేయవచ్చు.
వడ్డీ జమైందా లేదా అనేది మీరు బ్యాంక్ ఖాతా ద్వారానే చెక్ చేయగలరు. అయితే మీ అప్లికేషన్ స్టేటస్ కి సంబంధించి మాత్రం మీరు కింది లింక్ ద్వారా పూర్తి వివరాలు పొందవచ్చు.
Jagananna Thodu 2023-24 Status
జగనన్న తోడు పథకానికి సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింది లింక్ ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.
Leave a Reply