నిత్యావసర ధరలు పట్ట పగ్గాలు లేకుండా సామాన్య ప్రజలను భయపెడుతున్నాయి. ఇప్పటికే టమోటా, మిర్చి వంటి కూరగాయలు అయితే కొనే పరిస్థితి లేదు.
రానున్న నెలల్లో మరింత పెరగనున్న టమోటా, ఉల్లి
దేశవ్యాప్తంగా ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలలో 110 నుంచి 150 వరకు పలుకుతున్న టమోటా ధర ఆల్ టైం రికార్డ్ నమోదు చేసే అవకాశం ఉన్నట్లు నేషనల్ కమోడిటీస్ మేనేజ్మెంట్ సర్వీసేస్ NCML సీఈఓ సంజయ్ గుప్తా అన్నారు. ప్రస్తుతం ఉత్తర భారత దేశంలో 200 నుంచి 250 పలుకుతున్నటువంటి ధరలు గరిష్టంగా 300 వరకు వెళ్ళే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు.
మరింత ఘాటెక్కనున్న ఉల్లి
ప్రస్తుతం మార్కెట్లో 30-35 ఉన్న ఉల్లి ధరలు రానున్న నెలల్లో 100 వరకు చేరే అవకాశం ఉంటుందని సంజయ్ గుప్తా తెలిపారు.
దేశ వ్యాప్తంగా అకాల వర్షాలు, దిగుబడి తగ్గిన నేపథ్యంలో ధరలు పెరుగుదల అంచనా వేస్తున్నట్లు ప్రకటించారు.
పెరుగుతున్న బియ్యం మరియు నిత్యవసర ధరలు
దేశవ్యాప్తంగా ఇప్పటికే బియ్యం ధరలు కూడా పెరిగాయి. సోనా మసూరీ బియ్యం 25 కేజీల బస్తా పై 150-200 వరకు పెరిగింది.
కందిపప్పు ధర కూడా 30-50 రూపాయల వరకు కేజీ పై పెరిగి ప్రస్తుతం మార్కెట్లో 140 నుంచి 170 వరకు పలుకుతుంది.
మరోవైపు కూరగాయల ధరలు కూడా రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. గత ఏడాది లో సిలిండర్ ధర, పెట్రోల్ ధరలు, విద్యుత్ ధరలు, ప్రయాణ చార్జీలు విపరీతంగా పెరగడం వీటిని అదనంగా ప్రస్తుతం నిత్య అవసర సరుకుల ధరలు చుక్కల్ని తాకడం తో మూలిగే నక్క పై తాటి కాయ పడినట్లు అయింది సామాన్యుడి పరిస్థితి.
ఈ పరిస్థితులు చూస్తుంటే రానున్న రోజుల్లో సామాన్య ప్రజలు మార్కెట్ కి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి కనిపిస్తుంది.
మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్ లో తెలుపగలరు
Leave a Reply