జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి నిధులను ముఖ్యమంత్రి గత నెల అనగా జూన్ 28న బటన్ నొక్కి విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి విడుదల చేసి రెండు వారాలు దాటుతున్న ఇప్పటికీ చాలామంది ఖాతాలో డబ్బులు పడలేదని రిపోర్ట్ చేస్తున్నారు.
ఇంకా ఎంతమందికి పెండింగ్ ఉంది
జగనన్న అమ్మఒడి నిధులు ఇప్పటివరకు స్టడీబిజ్ ద్వారా కండక్ట్ చేసినటువంటి ఆన్లైన్ పోల్స్ ప్రకారం ఇంకా 40 నుంచి 60 శాతం మందికి అమౌంట్ జమ కావాల్సి ఉందని తెలుస్తుంది.
ఈసారి అసలు ఎందుకు ఆలస్యమైందో ప్రభుత్వం నుంచి ఇంకా క్లారిటీ లేదు.
Online Poll
అమ్మ ఒడి అమౌంట్ మీ ఖాతాలో జమ అయిందా లేదా కింది ఆన్లైన్ పోల్ ద్వారా తెలియజేయండి
జూలై 16 లోపు జమ చేస్తామని ప్రకటించినా ఇంకా చాలామందికి పెండింగ్
ప్రభుత్వం జూలై రెండవ వారం అనగా జూలై 10 నుంచి 16 లోపు పెండింగ్ నిధులను రోజూ కొందరికి చప్పున జమ చేస్తామని ప్రకటించినప్పటికీ ఇంకా చాలామందికి అమౌంట్ జమ కావలసి ఉన్నట్లు తెలుస్తోంది.
మరి జూలై మూడో వారంలో అయినా పేమెంట్ పడుతుందా అనేది చూడాలి. ఇటీవల విడుదలైన పంటల బీమా కూడా ఇంకా జమ కాలేదని పలువురు రైతులు రిపోర్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది విడుదల చేసినటువంటి పలు సంక్షేమ పథకాల నిధులు కొంతమేర ఆలస్యంగానే జమ అయ్యాయి. కాబట్టి జూలై 21 లోగా అమ్మ ఒడి పెండింగ్ నిధులు క్లియర్ చేసే అవకాశం ఉంది.
అమ్మ ఒడి పేమెంట్ స్టేటస్ ఇలా చెక్ చేయండి
కింది లింకు లో మీరు ఆన్లైన్లో అమ్మ ఒడి ఏ విధంగా చెక్ చేయవచ్చు అదేవిధంగా చెక్ చేసే లింక్ ఇవ్వబడ్డాయి. మీకు అప్లికేషన్ స్టేటస్ లో Eligible అని పేమెంట్ స్టేటస్ లో సక్సెస్ అని చూపిస్తుంది.
గమనిక : ప్రస్తుతం అమౌంట్ పడిన వారికి కింది విధంగా రెండు సక్సెస్ రికార్డులు చూపిస్తుంది.
కొంతమందికి పేమెంట్ సక్సెస్ చూపించినప్పటికీ ఇంకా అమౌంట్ ఖాతాలో జమ కాలేదు. అటువంటివారు వెయిట్ చేయండి లేదా మీ సచివాలయంలో సంప్రదించండి. అదేవిధంగా మీ బ్యాంక్ ఖాతా యాక్టివ్ లో ఉందో లేదో, మీ బ్యాంక్ ఆధార్ కి npci మ్యాపింగ్ జరిగిందో లేదో చెక్ చేసుకోండి. బ్యాంక్ ఆధార్ NPCI Mapping status కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Leave a Reply