రాష్ట్రవ్యాప్తంగా రేషన్ బియ్యం ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తున్నటువంటి MDU మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల యజమానులకు కూడా వైయస్సార్ వాహన మిత్ర అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.
9260 MDU వాహనదారులకు 10000
రేషన్ బియ్యం ఇంటింటికి సరఫరా చేసే 9260 MDU వాహనదారులకు 2023 24 ఆర్థిక సంవత్సరం నుంచి వైయస్సార్ వాహన మిత్ర ద్వారా పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది.
ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులను కూడా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తుంది. ఇందుకు సంబంధించినటువంటి ఉత్తర్వులను కింది లింకు ద్వారా క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
వైయస్సార్ వాహన మిత్ర పథకం
వైయస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆటో, టాక్సీ, మ్యాక్సి క్యాబ్ ను నడుపుకుంటూ జీవనోపాధిగా కొనసాగిస్తున్నటువంటి డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఇకనుంచి వీరితో పాటు ఎండియు వాహన లబ్ధిదారులకు కూడా ఈ ఆర్థిక సహాయం అందనుంది.
ఈ ఏడాది వాహన మిత్ర అప్లికేషన్స్ ప్రారంభం
ఈ ఏడాది వైయస్సార్ వాహన మిత్ర కి కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి ఇప్పటికే సచివాలయాలలో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ దరఖాస్తులకు తాత్కాలికంగా ప్రస్తుతం 20 జూలై 2023 చివరి తేదిగా నిర్ణయించడం జరిగింది. ఈసారి ఇంటింటికి రేషన్ సరఫరా చేసే వారిని కూడా కొత్తగా నమోదు చేయాల్సి ఉంటుంది.
వైయస్సార్ వాహన మిత్ర అమౌంట్ ఎప్పుడు
వైయస్సార్ వాహన మిత్ర 2023 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆగస్టులో ఈ పథకానికి సంబంధించిన నిధులను ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు.
YSR Vahana Mitra Release Date: August 2023
Leave a Reply