ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. వైఎస్ఆర్ వాహన మిత్ర మరియు కాపు నేస్తం పథకాలకు సంబంధించి సచివాలయాలకు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఏడాదికి గాను ఏ నెలలో ఏ ఏ పథకాలు అమలు చేయాలో పూర్తి వివరాలతో సంక్షేమ క్యాలెండర్ ను ఇదివరకే ప్రభుత్వం విడుదల చేసింది. సంక్షేమ కాలండర్ ప్రకారం వైయస్సార్ వాహన మిత్ర మరియు కాపు నేస్తం పథకాల నిధులు ఆగస్టులో విడుదల కానున్నాయి.
ఈ పథకాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియను మొదలుపెట్టాలని సచివాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ దరఖాస్తు ప్రక్రియకు తాత్కాలికంగా జూలై 20వ తేదీ చివరి తేదీ.
అర్హులైన లబ్ధిదారులు తమ పరిధిలోని సచివాలయాలకు వెళ్లి సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పించి కాపు నేస్తం మరియు వాహన మిత్ర పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
త్వరలో ఇందుకు సంబంధించిన టైమ్ లైన్స్ మరియు పూర్తి గైడ్ లైన్స్ విడుదల చేయడం జరుగుతుంది.
ఈ పథకాలకు సంబంధించి మరింత సమాచారాన్ని కింద ఇవ్వడం జరిగింది.
వైయస్సార్ వాహన మిత్ర పథకం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వాహన డ్రైవర్లకు రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తోంది. వాహన మెయింటెనెన్స్ ఖర్చులు, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్స్ వంటి ఇతర డాక్యుమెంట్లు పొందటానికి ప్రభుత్వం డ్రైవర్లకు ఈ ఆర్థిక సాయం అందిస్తోంది. ఆటో, ట్యాక్సి, మ్యాక్సి డ్రైవర్లకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. పది వేల రూపాయల ఆర్థిక సాయం పొందొచ్చు.
పేద కుటుంబాలకు చెందిన 18 ఏళ్లకు పైన వయసు కలిగి, ఆంధ్రప్రదేశ్‌లో స్థిర నివాసం కలిగి, రేషన్ కార్డులో పేరు కలిగిన వారికి స్కీమ్ వర్తిస్తుంది.మరియు ఈ పథకం కింద లబ్ధి పొందాలనుకునే వారికి ఆటో, ట్యాక్సీ కచ్ఛితంగా ఉండాలి.
ఈ పథకానికి సంబంధించిన మరింత సమాచారం మరియు లేటెస్ట్ అప్డేట్స్ కొరకు కింద లింక్ ని క్లిక్ చేయండి
వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కాపు, బలిజ,తెలగ కులాలలో ఆర్థికంగా వెనుక బడిన కుటుంబాలకి చెందిన మహిళలకు చేయూతనిచ్చే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ పథకంలో అర్హులైన వారికి సంవత్సరానికి 15 వేల రూపాయలు మూడు సంవత్సరాల వరకు ఇవ్వడం జరుగుతుంది.
కాపు, బలిజ,తెలగ కులాలకు చెందిన 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయస్సు గల మహిళలు ఈ పథకానికి అర్హులు.
ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు మరియు అర్హతలు మరియు లేటెస్ట్ అప్డేట్స్ కొరకు కింది లింకును క్లిక్ చేయండి
Leave a Reply