వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద చేనేత కార్మికుల పాలిట ఒక వరం. చేనేత కార్మికుల కుటుంబాలకు సంవత్సరానికి 24 వేల రూపాయల ఆర్థిక సహాయం కొరకు ప్రవేశపెట్టబడిన పథకమే వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం. చేనేత కార్మికులు వారి యొక్క మగ్గాల ఆధునీకరణకు మరియు ఇతర సామాగ్రికి ఈ పథకం ద్వారా చేసే ఆర్థిక సహాయం ఎంతగానో ఉపయోగపడుతుంది.
నేతన్న నేస్తం పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మరియు eKYC ప్రక్రియ ఇప్పటికే పూర్తి అయ్యింది. సోషియల్ ఆడిట్ కోసం అర్హుల జాబితాను సచివాలయంలో పొందు పరచడం జరిగింది.
ఈ నెల 21న నేతన్న నేస్తం పథకం కింద లబ్ధిదారులకు నిధులు జమ చేయనున్నారు. వరుసగా ఐదో ఏడాది ఈ పథకం అమలు ద్వారా 80,686 మందికి దాదాపు రూ.300 కోట్ల మేర ప్రభుత్వం లబ్ధి చేకూర్చనుంది.
Leave a Reply