అమ్మ ఒడి 2023 నిధులను ముఖ్యమంత్రి జూన్ 28 న విడుదల చేయడం జరిగింది. అయితే రెండు వారాల వరకు చాలా మందికి అమౌంట్ జమ కాలేదు. ఇటువంటి వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ వారం పేమెంట్ ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపింది. జూలై 16 లోపు అందరికీ అమౌంట్ జమ చేస్తామని ప్రకటించింది.
ఇది చదవండి: అమ్మ ఒడి అమౌంట్ విడుదల చేసి రెండు వారాలు దాటుతున్నా అమౌంట్ పడలేదా. ఈ వివరాలు మీకోసం
జమ అవుతున్న అమ్మ ఒడి అమౌంట్
అమ్మ ఒడి పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు జూలై 16 లోపు అమౌంట్ జమ చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
ఇందుకు సంబంధించి ఇప్పటికే అమౌంట్ విడుదల ప్రక్రియ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ వారం పలువురు లబ్ధిదారుల ఖాతాలో అమౌంట్ జమ చేయడం జరిగింది.
పలు సాంకేతిక కారణాల వలన ఒకేసారి అమౌంట్ విడుదల చేయలేకపోతున్నామని ప్రతిరోజు కొంతమంది లబ్ధిదారులు చొప్పున జూలై 16 లోపు అందరికీ అమౌంట్ విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
కాబట్టి అర్హత ఉండి EKYC పూర్తి అయినవారికి జూలై 16 లోపు అమ్మఒడి అమౌంట్ జమ కానుంది.
అమ్మ ఒడి అమౌంట్ మీ ఖాతా లో జమ అయిందా లేదా కింది ఆన్లైన్ పోల్ ద్వారా తెలియజేయండి
అమ్మ ఒడి పేమెంట్ స్టేటస్ ఇలా చెక్ చేయండి
జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ఆన్లైన్ లో మీ ఆధార్ నంబర్ ని ఉపయోగించి సులభంగా కింది ప్రాసెస్ ను ఫాలో అయ్యి మీరు అమ్మ ఒడి పథకానికి ఎలిజిబుల్ అయ్యారా లేదా అనేది అప్లికేషన్ స్టేటస్ లో చెక్ చేయవచ్చు. అదేవిధంగా పేమెంట్ వివరాలలో మీ పేమెంట్ సక్సెస్ అయిందా లేదా కూడా చూడవచ్చు.
చాలా మందికి పేమెంట్ స్టేటస్ లో సక్సెస్ చూపిస్తున్నప్పటికీ అమౌంట్ ఇంకా పడలేదు, అమౌంట్ జూలై రెండో వారం అనగా జూలై 16 లోపు విడుదల చేయనున్న ప్రభుత్వం. కాబట్టి వెయిట్ చేయండి లేదా మీ సచివాలయం లో సంప్రదించండి.
Join us on Telegram for regular updates
Leave a Reply