రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధుల నియంత్రణకు వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. జూలై 11 నుంచి మరో విడత ఇంటింటి ఫీవర్ సర్వేను ప్రారంభించడం జరిగింది.
1.63 కోట్ల ఇళ్లకు వెళ్లనున్న ఆరోగ్య సిబ్బంది, వాలంటీర్లు
ఈ విడత ఫీవర్ సర్వే లో భాగంగా ఆరోగ్య సిబ్బంది, వలంటీర్లు రాష్ట్రంలోని మొత్తం 1.63 కోట్ల గృహాలను సందర్శించి డెంగీ, మలేరియా, విష జ్వరాలతో బాధపడుతున్న వారిని, లక్షణాలున్న వారిని గుర్తిస్తున్నారు.
ఈ సర్వే కోసం సోమవారం ఉన్నతాధికారులు జిల్లాల వైద్య శాఖ, ఇతర శాఖల అధికారులతో వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది.
ఫీవర్ సర్వే యాప్ లో మార్పులు
గతంలో కరోనా లక్షణాలతో 50 వరకు సర్వేలు నిర్వహించిన ప్రభుత్వం, ప్రస్తుతం ఈ సర్వే లో సీజనల్ వ్యాధులను గుర్తించేందుకు మార్పులు చేయడం జరిగింది. ఇందులో కొత్తగా మలేరియా, డెంగీ, విష జ్వరాలను చేర్చినట్లు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ రామిరెడ్డి వెల్లడించారు.
ఫీవర్ సర్వే యాప్, మరియు డాష్ బోర్డ్
కింది లింక్ ద్వారా ఫీవర్ సర్వే చేపట్టే వాలంటీర్ యాప్ మరియు డాష్ బోర్డు లింక్ పొందవచ్చు.
ఫీవర్ సర్వే నిర్వహణపై అన్ని జిల్లాల డీఎంహెచ్వోలకు
మార్గదర్శకాలు జారీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
Leave a Reply