బీసీలకు లక్ష రూపాయల పథకం, బిగ్ అప్డేట్

బీసీలకు లక్ష రూపాయల పథకం, బిగ్ అప్డేట్

బీసిలలో కులవృత్తులు మరియు చేతివృత్తులు చేసుకునేటటువంటి వారికి లక్ష రూపాయలు అందించే బీసీలకు లక్ష పథకానికి సంబంధించి గత నెల 20 వరకు ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించడం జరిగింది.

ఇందుకు సంబంధించి ప్రతినెల అర్హులైన వారికి ప్రతి నెల 15వ తేదీన లక్ష రూపాయల చెక్కులను అధికారుల ద్వారా అందించనున్నట్లు ప్రభుత్వం గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

బీసీలకు లక్ష రూపాయల సహాయం కోసం 400 కోట్లు విడుదల

ఈనెల 15 న తొలివిడతగా పంపిణీ చేయనున్నటువంటి బీసీలకు లక్ష రూపాయల సహాయానికి సంబంధించి చెక్కుల పంపిణీ కోసం బీసీ సంక్షేమ శాఖ 400 కోట్ల రూపాయలను విడుదల చేసింది.

ఈనెల ఎంపికైనటువంటి లబ్ధిదారుల తుది జాబితాను కలెక్టర్లు జూలై 5 నాటికి ప్రభుత్వానికి అందించడం జరిగింది.

తొలి విడత సహాయం వీరికే

తొలి విడత లో భాగంగా జూలై 15 న వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, అత్యంత వెనుకబడిన వర్గాలకు, నిరుపేదలకు చెక్కులను పంపిణీ చేయనుంది. ప్రాధాన్యత క్రమంలో నియోజకవర్గాల వారిగా వీరిని ప్రతినెలా ఎంపిక చేస్తారు.

తదుపరి నెలల నుంచి పైన పేర్కొన్నటువంటి వర్గాలతో పాటు మిగిలిన వారికి కూడా చెక్కుల పంపిణీ ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. గత నెల 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 5.8 లక్షల మంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన తెలంగాణ పథకాలకు సంబంధించిన Telegram లో జాయిన్ అవ్వండి

Click here to Share

You cannot copy content of this page