రాష్ట్రంలోని చేనేత కార్మికులను ఆదుకోవడానికి రూపొందించిన వైయస్సార్ నేతన్న నేస్తం 2023 సంవత్సరానికి విడుదలకు సంబంధించి లబ్ధిదారుల ఈ కేవైసీ ప్రక్రియ పూర్తయింది.
eKYC ప్రక్రియ పూర్తయిన లబ్ధిదారుల అర్హతలను పరిశీలించి లబ్ధిదారుల ప్రాథమిక అర్హుల జాబితాను సచివాలయం NBM పోర్టల్ లో డౌన్లోడ్ చేసుకోవడానికి సచివాలయ ఉద్యోగులకు అవకాశం కల్పించడం జరిగింది.
ఈ లిస్టును డౌన్లోడ్ చేసి, సచివాలయంలో సోషల్ ఆడిట్ కొరకు సచివాలయాలలో ప్రదర్శిస్తున్నారు. సోషల్ ఆడిట్ లో భాగంగా ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని పరిశీలించిన తర్వాత తుది జాబితా విడుదల చేస్తారు.
2023-24 సంవత్సరానికి గాను దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు మీ దగ్గరలోని సచివాలయం సందర్శించి తుది జాబితాలో తమ పేరు ఉన్నదో లేదో చెక్ చేసుకోగలరు. లిస్టులో తమ పేరు రాని వారు సంబంధిత అధికారుల వద్ద రిజెక్షన్కు గల కారణాన్ని తెలుసుకోవచ్చు.
రిజెక్ట్ అయిన వారి లిస్టు కూడా రీ వెరిఫికేషన్ కొరకు ఎనేబుల్ చేయడమైనది. అర్హులైన వారు తప్పుగా రిజెక్ట్ అయి ఉంటే సంబంధిత డాక్యుమెంట్లను తిరిగి అందజేసి రీ వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చు.
Leave a Reply