ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులకు రూ.20 వేలు అడ్వాన్స్, పూర్తి వివరాలు

ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులకు రూ.20 వేలు అడ్వాన్స్, పూర్తి వివరాలు


రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి అవసరమైన అన్ని చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది.

ఇందులో భాగంగా ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులకు అడ్వాన్స్
బిల్లులను గృహనిర్మాణ శాఖ చెల్లిస్తోంది. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు 30 లక్షలకు పైగా ఇళ్లు నిర్మించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఇప్పటికే పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు రెండు దశల్లో 21.25 (18.63 లక్షలు సాధారణ +2.62 లక్షలు టిడ్కో) లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది. సాధారణ ఇళ్లలో ఇప్పటికే నాలుగు లక్షలకు పైగా నిర్మాణం పూర్తయింది.

మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. కాగా, బిలో బేస్మెంట్ లెవల్ (బీబీఎల్), బేస్మెంట్ లెవల్ (బీఎల్) దశల్లో ఇంటి నిర్మాణం ఉన్న లబ్ధిదారులకు రూ.20 వేలు, ఆ పై దశల్లో ఇంటి నిర్మాణం ఉన్న వారికి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ అడ్వాన్స్ రూపంలో బిల్లు చెల్లిస్తున్నారు.

సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ల ద్వారా అడ్వాన్స్ బిల్లులు అవసరం అని భావించే లబ్దిదారుల సమాచారాన్ని సేకరించి చెల్లింపులు చేస్తున్నారు.

ఇలా ఇప్పటివరకు 2,79,926 మంది లబ్ధిదారులకు రూ.111.17 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అడ్వాన్స్ మొత్తం అవసరం ఉన్న లబ్ధిదారుల సేకరణ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.

లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులు పడకుండా.. ఇంటి నిర్మాణానికి ఒక్కో యూనిట్కు ప్రభుత్వం రూ.1.80 లక్షలు చొప్పున బిల్లులు ఇస్తోంది. ఈ మొత్తాన్ని వివిధ నిర్మాణ దశలు పూర్తయిన అనంతరం విడతలవారీగా చెల్లిస్తారు.

నిర్మాణ దశ పూర్తయిన అనంతరమే బిల్లు మంజూరు అవుతుండటంతో తొలుత చేతి నుంచి డబ్బు పెట్టి నిర్మాణాలు చేపట్టడానికి లబ్ధిదారులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. దీంతో పనులు నెమ్మదిస్తున్నట్టు అధికారులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో బిల్లుల్లో కొంత మేర ముందగా చెల్లిస్తే లబ్ధిదారులు బయట అప్పులు చేసి వడ్డీలు కట్టే బాధ వారికి తప్పుతుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. లబ్దిదారులపై అదనపు భారం పడకుండా

ఇప్పటికే ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. యూనిటు రూ.1.80 లక్షలు ఇవ్వడంతో పాటు, పావలా వడ్డీకి రూ.35 వేలు చొప్పున బ్యాంక్ రుణాలు మంజూరు చేస్తోంది.

అంతేకాకుండా ఉచితంగా ఇసుక ఇవ్వడంతో పాటు సిమెంట్, ఇనుము, ఇతర నిర్మాణ సామాగ్రిని సబ్సిడీపై ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. ఉచితంగా ఇసుక ఇవ్వడం ద్వారా రూ.15 వేలు, సబ్సిడీపై ఇతర నిర్మాణ సామాగ్రి సరఫరా ద్వారా రూ. 40 వేలు చొప్పున ప్రతి లబ్ధిదారుకు మేలు చేకూరుతోంది.

Click here to Share

14 responses to “ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులకు రూ.20 వేలు అడ్వాన్స్, పూర్తి వివరాలు”

  1. G venkatalakshmi Avatar
    G venkatalakshmi

    Ebc nestam

  2. గేదెల సూరమ్మ Avatar
    గేదెల సూరమ్మ

    పేమెంట్ రిటన్ సార్
    బెనిఫిసిరే నే గేదెల సూరమ్మ
    పార్వతిపురం మన్యం జిల్లా
    ప్లీజ్ సర్ అమౌంట్ సెండ్ మీ
    మండలం సాలూరు పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఎరుకుల స్ట్రీట్

  3. Ramu Ramu Avatar
    Ramu Ramu

    Madi basement avutundi e amount 20`000 estey use avutundi sir cherlopalli site kadapa

  4. పొట్నూరు రాణి Avatar
    పొట్నూరు రాణి

    మేము విశాఖపట్నం లో గత 40 సంవత్సరలుగ ఈక్కడ జీవనం కొనసాగిస్తునాం ఎన్ని సార్లు హౌస్ కోసం పెట్టిన రావటం లేదు సొంత ఇల్లు లేక అద్దే కట్టలేక సతమతము అవుతున్నాము plz సార్ ఈప్పుడేనా మాకు సొంత ఇల్లు ఇవ్వండి

    1. Venu Avatar
      Venu

      YSR Congress party lo mi enti problem solve

      1. Shaik subhani Avatar
        Shaik subhani

        Not my house srat

  5. Nagendra babu Avatar
    Nagendra babu

    Hi

    1. Sameera Alle Avatar
      Sameera Alle

      Sir maku marriage i 11 years avuthuindi no own house sir, rent ke untunamu, maku jagan house kala nizam cheyali ani korukuntuna 🙏

  6. Garlapati ramuru Avatar
    Garlapati ramuru

    Sri maku colony ledhu sri

  7. Garlapati ramuru Avatar
    Garlapati ramuru

    Sri maku colony ledhu sri Nellore jalli district dagadathi madhala

  8. Gubai. Venkat Rao Avatar
    Gubai. Venkat Rao

    మా ఊరు గానుగవలస విలేజ్, లోతేరు పంచాయతీ అరకు వేలి మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా, మా అమ్మగారి పేరు గూబయి జానకి మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఇల్లు వచ్చింది, మేము బేస్మెంట్ వరకు చేసాము కానీ ఇంతవరకు బిల్లు పడలేదు, అలాగే సబ్సిడీ రూపంగా మాకు ఒక 50 వేల రూపాయలు డబ్బులు ఇస్తే మాకు భరోసా లాగా ఉంటుంది, అంతే కాకుండా ఉచితంగా ఇసుక సిమెంట్ ఇనుము ఇతర నిర్మాణ సమాగ్రిని ఉచితంగా ఇవ్వడం లేదు, మేము 70 కిలోమీటర్ల దూరం నుండి ఇసుక తెచ్చుకుంటున్నాము దయచేసి ఉన్నత అధికారులకు మా యొక్క విజ్ఞప్తి థాంక్యూ సో మచ్.

  9. Nuthalapati ramadevi Avatar
    Nuthalapati ramadevi

    Sir maadi guntur district,naa daggara bank account teesukoledu,house gurinchi naaku advance payment raledu sir

  10. Hari Avatar
    Hari

    Message 8309077263

  11. Bobby Avatar
    Bobby

    BL completed but loan inactive

    Pls sir

    G Venkatalaxmi komaragiri IPM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page