గుడ్ న్యూస్….. పేదలకు ఉచితంగా వ్యవసాయ భూమి పంపిణీ చేయనున్న ప్రభుత్వం

గుడ్ న్యూస్….. పేదలకు ఉచితంగా వ్యవసాయ భూమి పంపిణీ చేయనున్న ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుపేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

పేదల అభ్యున్నతి దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేస్తోంది. కూలినాలి చేసుకుని కష్టంగా బతుకు బండి లాగుతున్న వారిని, కౌలుకు తీసుకుని ఆరుగాలం శ్రమిస్తున్న వారిని భూ యజమానులుగా చేయనుంది. తద్వారా ‘ఈ భూమి మాదే’ అని అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు గర్వంగా చెప్పుకునేలా చేయాలని తాపత్రయ పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 54 వేల ఎకరాల భూ పంపిణీకి వేగంగా చర్యలు తీసుకుంటోంది.

సుదీర్ఘకాలం తర్వాత రాష్ట్రంలోని నిరుపేదలకు వైఎస్ జగన్ ప్రభుత్వం వ్యవసాయ భూములు పంపిణీ చేయనుంది. 23 జిల్లాల్లో 54 వేల ఎకరాలను అర్హులైన పేదలకు పంచేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లో అర్హులైన సుమారు 47 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేసింది. ఆయా జిల్లాల అసైన్మెంట్ కమిటీల ఆమోదం కూడా దాదాపు పూర్తయింది. భూమి లభ్యతను బట్టి ఒక్కో లబ్ధిదారునికి ఒకటి నుంచి ఒకటిన్నర ఎకరం వరకు భూమి ఇవ్వనున్నారు. గ్రామాల్లో నిరుపేదలకు వ్యవసాయ భూములు ఇవ్వాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్ ఏడాది కిందటే కసరత్తు మొదలుపెట్టారు. అన్ని జిల్లాల్లో పేదలకు ఇవ్వడానికి అందుబాటులో ఉన్న భూమి, అర్హులైన లబ్ధిదారుల వివరాలతో నివేదికలు ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. కలెక్టర్ల పరిశీలన తర్వాత 23 జిల్లాల్లోనే అందుబాటులో ఉన్నట్లు తేలింది.

వైఎస్సార్, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఆశాజనకంగా భూమి అందుబాటులో ఉండగా, మరో 8 జిల్లాల్లో వెయ్యి నుంచి 4 వేల ఎకరాల లోపు భూమి లభ్యత ఉన్నట్లు నిర్ధారణ అయింది. మరో 9 జిల్లాల్లో వెయ్యి నుంచి 2 వేల ఎకరాల భూమి ఉండగా, 4 జిల్లాల్లో వెయ్యి ఎకరాల లోపు భూమి అందుబాటులో ఉన్నట్లు కలెక్టర్లు నివేదికలు ఇచ్చారు. విశాఖ, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో భూమి అందుబాటులో లేదు. దీంతో భూమి లభ్యత ఉన్న 23 జిల్లాల్లో గుర్తించిన భూమిని సర్వే చేసి, డిమార్కేషన్ చేయించారు. అసైన్మెంట్ కమిటీల అనుమతులు కూడా లభించాయి. త్వరలో మంత్రివర్గం భూ పంపిణీకి ఆమో
దముద్ర వేసే అవకాశం ఉంది.

అత్యధికంగా వైఎస్సార్ జిల్లాలో 8,916 ఎకరాలను పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత శ్రీ సత్యసాయి జిల్లాలో 7,476, కర్నూలు 4,092, నంద్యాల 3,678, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు 3,711, కాకినాడ 2,935, చిత్తూరు 2,866, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2,565 ఎకరాలను పంపిణీ చేయనున్నారు.

Click here to Share

24 responses to “గుడ్ న్యూస్….. పేదలకు ఉచితంగా వ్యవసాయ భూమి పంపిణీ చేయనున్న ప్రభుత్వం”

  1. గుండేపల్లి నరేష్ Avatar
    గుండేపల్లి నరేష్

    మరి OC(కాపులో) చాలా మంది సేంటు పోలం లేని వారు ఉన్నారు కదా (కాపులాంటే) ఎందుకూ పక్షపాతం వారు ఓటు వేయలేద వారు ఏమితప్పు చేసారు SC ST BC మైనాట్టి వర్గాలు లాభాలు చేశాయి

    1. గుండేపల్లి నరేష్ Avatar
      గుండేపల్లి నరేష్

      నాకు సెంటు పొలం లేదు ఇన్ని పథకాలు పెట్టిన నాకు OC అయిన కారణం గా ఒక్క పథకం వర్తించలేదు నేను 2022 లో 3 ఎకరలు కౌలు పొలం 50.000 నష్టం వచ్చింది OC కాబట్టి కనీసం కౌలు రైతు డబ్బులు కానీ పంట నష్టం కానీ రాలేదు ఇప్పుడు ఒక ఎకరము మాత్రమే చేస్తున్న అది కూడా కౌలు పోలమే దయచేసి నాకు కూడా పొలము ఏవండీ

  2. D.sreenivasulu Avatar
    D.sreenivasulu

    Namaste jagan sir,meeru pedalaku enno manchi panulu chestunnaru,ee bhupampinikuda chala manchidi,maa vinnapam emanaga,meemu bhumileni pedalamu 1/2 acre d pharm bhumi konnukkunnamu ila konukkunna d pharm bhumilukuda konnavari perutho patta isthe maa lanti pedalu mimmalni taluchkuntaru,kavuna sir mavinna paanni dayachesi manninichandi sir.

  3. అలబాని సూరిబాబు Avatar
    అలబాని సూరిబాబు

    A, suribabuallaboni@gmail.com
    విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం
    రెడ్డి పల్లి అగ్రహారం భద్రయ్య పేట గ్రమం

  4. Santharao Avatar
    Santharao

    Enduku Mee ichhina Mee nayakulu tintaru nijayatiga ichhedi ledu

  5. Marlapalli Swarna kumari Avatar
    Marlapalli Swarna kumari

    Naku Southampton House kuda ledu ADHI INTLO UNTUNANU

  6. Marlapalli Swarna kumari Avatar
    Marlapalli Swarna kumari

    NAA PERU M.SWARN KUMARI NAKU PARENTS LERU KULI PANI CHESUKONI BRUTHUKUTHUNANU .NAKU JOB LEDU . BUMI LEDU MATHANDRIKI BOOMI ECHARU ADI MAA ANAYYA THISUKONI PANDICHUKUNTU NADU ADIGITHE MEEKU BOOMI EKKADADHI ANTUNADU. NAKU PELLI AVALEDU KULI PANI CHESUKONI BRATHUKUTHUNANU. THANK YOU

  7. Turaka nagamaliesworao Avatar
    Turaka nagamaliesworao

    Maku bumi ledu sar
    Piduguralla mdl
    Guntur district
    Janapadu veleji

  8. Thimmaraju Avatar
    Thimmaraju

    Ekaralidu

  9. A Ramakrishnudu Avatar
    A Ramakrishnudu

    Good. Gvot 🙏🙏🙏👌👌👌

  10. MRamachandra Avatar
    MRamachandra

    Sr makubumepampakalu kavali adi gvarnamet bume uvabagalu vepsit opanledu passbook ledu annadammupampakau vavasayampandichamu kurnool kowtalam (m)madire

  11. Koikola Avatar
    Koikola

    Ichestaru government land ki patta ne kadu pakkintodi pellamtho kuda pelli cheistaru alla thayaraindi ee Government..?

  12. Joshua Thumpala Avatar
    Joshua Thumpala

    I don’t have any land and agriculture land.and I am an unemployed,working self employ..for daily wage to lead my family.
    This opportunity those people are getting very good Butt in eastgodvari district we didn’t hear about this news.if it in process please remember me,I am so glad if I get this opportunity .
    Indeed I am poor ,I hope this opportunity may receive the poor people. If it is not happen there is no difference between the political parties in andhrapradesh….
    Still o didn’t get any scheme from ap government except 2year ammavodi,this year o didn’t get.
    There is much partiality in politics..because they are giving much and first priority..I mean completely for workers of their parties.

  13. K vidya sagar Avatar
    K vidya sagar

    How to apply, where to apply, is there any public notification

  14. S. Satish Avatar
    S. Satish

    Hi

  15. G.sreenevasulu Avatar
    G.sreenevasulu

    Sir.neanu.govt.land.cheasthunanu.naku.patta kavale.sir

  16. P srinivasa Reddy Avatar
    P srinivasa Reddy

    Kolanukoda

  17. Ponnuru ramesh Avatar
    Ponnuru ramesh

    Super sir free bhoomi

    1. D v subbareddy Avatar
      D v subbareddy

      Maku bhumi ledu sir illu ledu sir

  18. Kummari. Venkatapadmanabhudu Avatar
    Kummari. Venkatapadmanabhudu

    Makubhoomi ledusir me
    mu kulipanichukunevalamsir makuvyavasayam chosukodaniki bhoomikavali

    1. MUJIBUDDEEN CHOWDARI Avatar
      MUJIBUDDEEN CHOWDARI

      Naku agriculture land kavali

    2. Haseena Avatar
      Haseena

      Me yela aplecheyali

      1. Sarada dhanalakshmi Avatar
        Sarada dhanalakshmi

        Sir maku kuda bhumi kavali memu nirupedalamu maku inti stalam kuda ivvaledu nannu na husband vadilesaadu

      2. Uppari sudharshan Avatar
        Uppari sudharshan

        Maa ku bumi ledhu sir bumi ivvandi

You cannot copy content of this page