తెలంగాణలో రైతుల కోసం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు తమకు కూడా వర్తింపచేయాలని తమిళనాడు రైతు సంఘాలు డిమాండ్ చేశాయి.ఈ మేరకు తమిళనాడులోని కృష్ణగిరి లో బుధవారం భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది.
రైతుబంధు, రైతు బీమా మాకు కావాలి
తెలంగాణ తరహాలో రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24/7 ఉచిత విద్యుత్, నీటిపారుదల మరియు ఆహార ధాన్యాల సేకరణను ఎంఎస్‌పితో అమలు చేయాలని తమిళనాడు రైతులు బుధవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రతి సంవత్సరం జూలై 5న “తమిళనాడు రైతు దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ గా వస్తుంది. ఈసారి ఈ కార్యక్రమాన్ని తమిళనాడు జిల్లా కేంద్రమైన కృష్ణగిరిలో జరుపుకున్నారు. తమిళ్ అగ్రికల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది రైతులు పాల్గొని బహిరంగ సభతో భారీ ర్యాలీ నిర్వహించారు.
ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన తమిళ అగ్రికల్చర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.ఎం.రామ గౌండర్, దక్షిణ భారత రైతు సంఘ సమాఖ్య అధ్యక్షుడు కోటపాటి నరసింహా నాయుడు, కర్నాటక రాష్ట్ర రైతు సంఘాల అధ్యక్షుడు కె.శాంత కుమార్‌లు రైతుల డిమాండ్లను ఈ ర్యాలీ వేదికగా లేవనెత్తడం జరిగింది. ర్యాలీలో ప్రసంగించిన రైతులు, ఇతర సభ్యులు తెలంగాణ మోడల్ అభివృద్ధిని తమిళనాడులో కూడా పునరావృతం చేయాలని ఈ మేరకు డిమాండ్ చేశారు.
Leave a Reply