ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి కౌలు రైతులు 2023 24 రైతు భరోసా తొలి విడత అమౌంటు సహాయాన్ని పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ తెలిపారు.
అర్హత ఉన్నవారు ఇలా దరఖాస్తు చేసుకోండి
రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్న కౌలు రైతులు 2023 24 రైతు భరోసా సహాయం కోసం మీ సమీప రైతు భరోసా కేంద్రంలో లేదా మీ వ్యవసాయ సహాయకులను సంప్రదించి రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ మేరకు ప్రస్తుతం వ్యవసాయ సహాయకులకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు కింది డాక్యుమెంట్స్ ను తీసుకువెళ్లండి.
- రైతుల సిసిఆర్సి కార్డ్
- ఆధార్ కార్డ్
- బ్యాంకు పాస్ పుస్తకం మొదటి పేజి జిరాక్స్ కాపీ
- ఫోన్ నెంబర్
Rythu Bharosa 2023-24 Registrations ongoing for tenant farmers
ఈ నెలాఖరు నాటికి సిసిఆర్సి కార్డుల జారీకి ఆదేశాలు
ఈ నెలాఖరు నాటికి కౌలు రైతుల గుర్తింపు కార్డులు సిసిఆర్సి ల జారీ ప్రక్రియను రెవెన్యూ అధికారులతో కలిసి త్వరితగతిన పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం జగనన్న సురక్ష పథకంలో భాగంగా నిర్వహిస్తున్న క్యాంపులలో కూడా అర్హత ఉన్న కౌలు రైతులకు ఉచితంగా సిసిఆర్సి కార్డులను జారీ చేస్తున్న విషయం తెలిసింది. అర్హత ఉన్నవారు రైతు భరోసా కేంద్రాలలో లేదా మీ సచివాలయాలలో సంప్రదించండి.
రైతు భరోసా 2023-24 పేమెంట్ స్టేటస్ వివరాలు మరియు ఇతర అప్డేట్స్ అన్ని కింది లింక్ ద్వారా చెక్ చేయండి.
Leave a Reply