వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి గత ఏడాది ఖరీఫ్ సీజన్ లో పంట నష్ట పోయిన రైతులకు ఈ నెల 8 న ముఖ్యమంత్రి నష్టపరిహారాన్ని విడుదల చేయనున్నారు.
పంట బీమా అభ్యంతరాలకు జూలై 5 చివరి తేదీ
ఇందుకు సంబంధించి అర్హులైన రైతుల జాబితాలను రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తున్నట్లు అభ్యంతరాలు ఏమైనా ఉంటే బుధవారంలోగా ఆర్బికే కేంద్రాలలో సిబ్బందికి తెలియచేయాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ తెలిపారు.
గత ఐదు రోజులుగా లబ్ధిదారుల జాబితాలను సోషల్ ఆడిట్ కోసం రైతు భరోసా కేంద్రాల వద్ద ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే, ఇందుకు సంబంధించి జూలై 5 వరకు అభ్యంతరాల స్వీకరణ గడువును ప్రభుత్వం పొడిగించడం జరిగింది. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటె లిఖిత పూర్వకంగా స్వీకరించడం జరుగుతుంది.
జూలై 8న ఉచిత పంటల బీమా అమౌంట్, 10.2 లక్షల మందికి పరిహారం
ఈనెల 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి సందర్భంగా రైతు దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది అదే రోజున అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పర్యటనలో భాగంగా ఉచిత పంటల భీమా సహాయాన్ని ముఖ్య మంత్రి రైతుల ఖాతాలో జమ చేయమన్నారు.
ఈసారి 10.2 లక్షల మంది రైతుల ఖాతాలో 1,117.21 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయనున్నారు.
Uchitha Pantala Bheema Release Date : July 08 2023
కొత్తగా 52 వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ ప్రారంభించనున్న సీఎం
రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా నిర్మించినటువంటి 52 వైయస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రీ ల్యాబ్స్ ను ముఖ్యమంత్రి జూలై 8వ తేదీన ప్రారంభించనున్నారు
అదే విధంగా ఈ నెలాఖరుకు కౌలు రైతులకు సిసిఆర్సి కార్డులు జారీ చేయాలని అధికారులకు ప్రత్యేక కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
2023 24 సీజన్ కు సంబంధించి తొలి విడత వైఎస్ఆర్ రైతు భరోసా సహాయం కోసం అర్హత గల కౌలు రైతులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
వైయస్సార్ ఉచిత పంటల బీమా స్టేటస్ ను ఆన్లైన్ లో కూడా చెక్ చేయవచ్చు
వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి అర్హత ఉన్న వారి జాబితాను రైతు భరోసా కేంద్రాలతో పాటు ఆన్లైన్లో కింది లింకు ద్వారా కూడా చెక్ చేయండి.
స్టేటస్ చెక్ చేసేటప్పుడు kharif 2022 అని ఎంచుకొని చెక్ చేయగలరు.
లేదా రైతులు తమ ఈ క్రాప్ స్టేటస్ ని కూడా చెక్ చేయవచ్చు. ఈక్రాప్ స్టేటస్ ఆధారంగానే పంటల భీమా కూడా అమలు అవుతుంది.
Leave a Reply