రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్ధులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టాప్ యూనివర్శిటీలలో ఉన్నత విద్యా కోర్సులు అభ్యసించేందుకు అవసరమైన ఆర్ధిక సహాయాన్ని జగనన్న విదేశీ విద్యా దీవెన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి జూన్ నెలాఖరు వరకు దరఖాస్తులు స్వీకరించగా ప్రస్తుతం ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి, రిజిస్ట్రేషన్ సమయంలో అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకోండి.
జూన్ నెల ఆఖరు వరకు జరిగిన విదేశీ విద్య దీవెన రిజిస్ట్రేషన్లు
ప్రతి ఏడాది రెండు విడతల్లో ఈ రిజిస్ట్రేషన్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అర్హతగా ఉండి ఎంపికైనటువంటి విద్యార్థులకు ప్రభుత్వం రెండు విడతల్లో అమౌంటును కూడా జమ చేస్తుంది.
గత ఏడాది టాప్ 200 విదేశీ యూనివర్శిటీల్లో అడ్మిషన్లు పొందిన 213 మంది విద్యార్ధులకు మొదటి విడత సాయంగా రూ. 19.95 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు జమ చెయ్యడం జరిగింది.
ఈ ఏడాది రెండో విడత సంబంధించి విదేశీ విద్యా దీవెన సంబంధించి రిజిస్ట్రేషన్ లను ప్రభుత్వం గత నెల ప్రారంభించగా, ఈ దరఖాస్తులకు తొలుత మే నెల ఆఖరు వరకు, ఆ తర్వాత జూన్ 10 వరకు గడువుగా పొడిగించడం జరిగింది అయితే లబ్ధిదారుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు ఈ దరఖాస్తు గడువును జూన్ 30వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది.
Videshi Vidya deevena last date : 30 June 2023
అర్హులైన విద్యార్థులు జ్ఞానభూమి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది.
రెండో విడత లో 186 దరఖాస్తులు
రెండో విడత రిజిస్ట్రేషన్స్ ముగియాగా మొత్తం 186 అప్లికేషన్స్ వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. వీరికి మంగళవారం అనగా జూలై 4 నుంచి తాడేపల్లి లో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.
విదేశీ విద్యా దీవెన కు కావలసిన డాక్యుమెంట్స్ [Videshi Vidya Deevena Application Process and Documents verification]
దరఖాస్తు విధానం మరియు డాక్యుమెంట్స్→ అభ్యర్థి ఆన్‌లైన్ దరఖాస్తు చేసేందుకు https://jnanabhumi.ap.gov.in లో ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇందుకోసం కింది పత్రాలు తీసుకోవడం జరిగింది. ఈ పత్రాలను మీ ఇంటర్వ్యూ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో కూడా దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది.
1. సంబంధిత గ్రామం/వార్డు సెక్రటేరియట్ నుండి కుల ధృవీకరణ పత్రం.
2. సంబంధిత గ్రామ/వార్డు సచివాలయం నుండి ఆదాయ ధృవీకరణ పత్రం మరియు అందులో సంబంధిత జిల్లా కలెక్టర్ ద్వారా భౌతికంగా ధ్రువీకరించబడి ఉండాలి.
3.విద్యార్థి కుటుంబం యొక్క రేషన్ కార్డ్ (ఒకవేళ ఉంటే ఇవ్వాలి)
4.SSC సర్టిఫికేట్/పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం (పథకానికి నిర్దేశించిన అర్హత వయస్సును నిర్ణయించేందుకు)
5.ఆధార్ కార్డ్
6.మీసేవా/రెవెన్యూ శాఖ నుండి నేటివిటీ సర్టిఫికేట్.
7. MBBS/PG కోర్సు/Ph.D తదితర కోర్సులో ప్రవేశానికి సంబంధిత ఇంటర్మీడియట్/డిగ్రీ/PG సర్టిఫికేట్ సమర్పించాలి
8.అర్హత పరీక్ష యొక్క మార్క్ షీట్ (కనీసం సూచించిన మార్కులను సంపాదించినట్లు రుజువు కోసం)
9.TOEFL/IELTS/GRE/GMAT స్కోర్ షీట్
10.విదేశీ విశ్వవిద్యాలయం నుండి షరతులు లేని ఆఫర్ లెటర్
11.NEET స్కోర్ కార్డ్ (MBBS కోర్సులో ప్రవేశం కోసం)
12. కుటుంబ సభ్యుల తాజా పన్ను రిటర్న్‌ల కాపీ (ఒకవేళ ఉంటే )
13. విద్యార్థి యొక్క జాతీయ బ్యాంకు ఖాతా వివరాలు
14. తాజా పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
15.స్కాన్ చేసిన సంతకం
16. దరఖాస్తు దారులు లేదా తన కుటుంబంలోని ఏ ఇతర సభ్యుడు రాష్ట్రం నుండి లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇలాంటి పథకం కింద ఆర్థిక సహాయం పొందలేదని విద్యార్థి నుండి స్వీయ-ధృవీకరణ.
విదేశీ విద్యాధీన పథకానికి సంబంధించి అప్లికేషన్ లింక్ కింద ఇవ్వబడింది చెక్ చేయండి.
Leave a Reply