రాష్ట్రవ్యాప్తంగా జగనన్న అమ్మఒడి 2023-24 అమౌంట్ ను ముఖ్యమంత్రి జూన్ 28 న విడుదల చేయడం జరిగింది. అయితే 5 రోజులు దాటినా ఇప్పటికీ చాలా మంది లబ్ధిదారులు అమౌంట్ పడలేదు అని రిపోర్ట్ చేస్తున్నారు. అమ్మ ఒడి అమౌంట్ ఇంకా ఎందుకు పడలేదు? అదేవిధంగా ఆన్లైన్ లో పేమెంట్ స్టేటస్ ని ఎలా తెలుసుకోవచ్చు అనే వివరాలు కింద ఇవ్వబడ్డాయి.చెక్ చేయండి.
జగనన్న అమ్మఒడి 2023 24 అమౌంట్ పడలేదా?
జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి 5 రోజులు దాటినా ఇంకా మీ ఖాతాలో అమౌంట్ పడనట్లయితే కింది కారణాలు అయి ఉండవచ్చు.
ఈసారి అమౌంట్ చాలామందికి ఇంకా పడలేదు
గత ఏడాది అమ్మఒడి అమౌంట్ లేదా ఇతర పథకాలు జమ అయిన వెంటనే ఖాతాలో పడేవి అయితే ఈసారి ఐదు రోజులు దాటుతున్న ఇంకా అమౌంట్ పడలేదు.
చాలామందికి ఈ అమౌంట్ ఇంకా పడలేదు, Studybizz ద్వారా ఇందుకు సంబంధించి వెబ్సైట్ మరియు టెలిగ్రామ్ , వాట్సప్ ద్వారా పోల్ నిర్వహించడం జరిగింది. అయితే ఒపీనియన్ పోల్ లో 80-90% మంది తమకి ఇంకా అమౌంట్ పడలేదని తెలపడం జరిగింది. అదేవిధంగా కామెంట్ రూపంలో కూడా తెలియజేస్తున్నారు.
కాబట్టి లందిదారులు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, అందరికీ దశలవారీగా ఒకేసారి అమౌంట్ పడే అవకాశం ఉంది.
అసలు ఎందుకు అమౌంట్ ఆలస్యం అవుతుంది?
అమ్మ ఒడి పథకానికి సంబంధించి ఈ కేవైసీ ప్రక్రియ అంటే తప్పు తీసుకునే ప్రక్రియ చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. అమ్మ ఒడి ప్రారంభానికి కేవలం రెండు రోజులు ముందే ఈ ప్రక్రియ ప్రారంభమై చాలామంది పేర్లు జాబితాలో రాలేదు. అదేవిధంగా అమ్మ ఒడి ప్రారంభించిన తర్వాత కూడా ఈకేవైసి ఆప్షన్ అనేది కొనసాగడం జరిగింది. ఇది ఒక కారణమైతే,మరొక ముఖ్య కారణమేంటంటే ఈసారి ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఒడి అమౌంట్ విడుదల కార్యక్రమాన్ని 10 రోజులపాటు నిర్వహిస్తామని ప్రకటించడం జరిగింది. జూలై 7 లోపు ఎప్పుడైనా లబ్ధిదారుల ఖాతాలో అమౌంటు వేసే అవకాశం ఉంది.
పది రోజులపాటు జగనన్న అమ్మ ఒడి కార్యక్రమం
ఇక జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ఈసారి జూలై 7 వరకు మండల స్థాయిలో వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. దీంతో జూలై 7 వరకు కూడా అమౌంట్ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ మీకు అర్హత ఉండి, జాబితాలో పేరు ఉన్నప్పటికీ అమౌంట్ పడకపోతే జులై 7 లోపు పడే అవకాశం ఉంది. చాలామందికి ఇంకా అమౌంట్ పడలేదు కాబట్టి ఒకేసారి దశల వారీగా అమౌంట్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
అర్హత ఉన్న పేర్లు రానివారికి గ్రీవియన్స్ ఆప్షన్
మీకు అర్హత ఉన్నా అమ్మఒడి జాబితాలో పేరు రాలేదా? అయితే ఇందుకు సంబంధించి సచివాలయం లాగిన్ లో గ్రివెన్స్ అంటే కంప్లైంట్ తీసుకునే ఆప్షన్ ను కల్పించడం జరిగింది.
బ్యాంకులకు వరుస సెలవులు కూడా కారణం
మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే బ్యాంకులకు బక్రీద్ పర్వదిన సందర్భంగా జులై 29న సెలవు దినంగా ఉంది. అదే విధంగా మధ్యలో శుక్రవారం మినహాయిస్తే తిరిగి శని ఆదివారాలు రావడం జరిగింది. దీంతో కొంత మేర పేమెంట్ విడుదల ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
ఇదే సమయంలో పెన్షన్ పంపిణీ అమౌంట్ ను కూడా బ్యాంకులు ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ కారణాలు అమ్మ ఒడి పేమెంట్ ప్రాసెసింగ్ పై ప్రభావం చూపించే అవకాశం ఉంది.
ఈ ఏడాది వసతి దీవెన, రైతు భరోసా కూడా ఆలస్యం
ఈ ఏడాది రైతు భరోసా మరియు వసతి దీవెన అమౌంట్ కూడా కొంత ఆలస్యంగానే జమ చేయడం జరిగింది. వసతి దీవెన అమౌంట్ అయితే ఏకంగా 10 రోజుల తర్వాత జమ చేయడం జరిగింది. కాబట్టి ఇదే తరహాలో అమ్మ ఒడి కూడా కొంత ఆలస్యంగా అయినా లబ్ధిదారుల ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది.
ఇక జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి పేమెంట్ స్టేటస్ మరియు మీరు ఎలిజిబుల్ అవునా కాదా ఇలా చెక్ చేయండి
జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ఆన్లైన్లో మీ ఆధార్ నంబర్ ని ఉపయోగించి సులభంగా కింది ప్రాసెస్ ను ఫాలో అయ్యి మీరు అమ్మ ఒడి పథకానికి ఎలిజిబుల్ అయ్యారా లేదా అనేది అప్లికేషన్ స్టేటస్ లో చెక్ చేయవచ్చు. అదేవిధంగా పేమెంట్ వివరాలలో మీ పేమెంట్ సక్సెస్ అయిందా లేదా కూడా చూడవచ్చు.
చాలా మందికి పేమెంట్ స్టేటస్ లో సక్సెస్ చూపిస్తున్నా అమౌంట్ ఇంకా పడలేదు, అమౌంట్ జూలై 7 లోపు విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి వెయిట్ చేయండి లేదా మీ సచివాలయం లో సంప్రదించండి.
కింది లింకు ద్వారా మీరు అమ్మ ఒడికి పేమెంట్ స్టేటస్ ను చెక్ చేయండి
Follow us on Telegram for regular updates
Leave a Reply