LAW NESTHAM 2023-24 – లా నేస్తం ఈ ఏడాది తొలి విడత అమౌంట్ విడుదల.. జూనియర్ లాయర్ల ఖాతాలో ₹25000 జమ

LAW NESTHAM 2023-24 – లా నేస్తం ఈ ఏడాది తొలి విడత అమౌంట్ విడుదల.. జూనియర్ లాయర్ల ఖాతాలో ₹25000 జమ

జూనియర్ లాయర్ల కు గుడ్ న్యూస్..వరుసగా అయిదో ఏడాది కొత్తగా ‘లా’ గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన యువ లాయర్లకు వైఎస్సార్ లా నేస్తం అమౌంట్ ను సీఎం విడుదల చేశారు.

2677 మందికి ₹25000 జమ చేసిన సీఎం

రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్న 2677 మంది జూనియర్ లాయర్ల ఖాతాలో నెలకు 5000 చప్పున ఫిబ్రవరి 2023 నుంచి జూన్ 2023 వరకు ఐదు నెలల కాలానికి కలిపి 25000 రూపాయలు జమ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఈరోజు బటన్ నొక్కి వారి ఖాతాల్లోకి నగదు విడుదల చేశారు. మొత్తం 6,12,65,000 రూపాయలను ఈ మేరకు వార్ ఖాతాలో జమ చేయడం జరిగింది.

ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది ? Law Nestham Eligibility

కొత్తగా లా డిగ్రీ పూర్తి చేసిన వారికి వృత్తిలో నిలదొక్కుకునేందుకు 3 సంవత్సరాల పాటు నెలకు రూ.5,000 చొప్పున వీరికి ప్రభుత్వం స్టైఫండ్ అందిస్తూ వస్తుంది. ప్రతి ఏటా రెండు విడతల్లో ఈ అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది.

Law Nestham పథకానికి ఎలా apply చేసుకోవాలి?

ప్రతి ఆరు నెలలకోసారి అమౌంట్ విడుదల చేసేలా పథకం లో మార్పులు చేయడం జరిగింది.

అర్హులైన యువ అడ్వకెట్లు, పథకానికి అప్లై చేయడానికి https://ysrlawnestham.ap.gov.in వెబ్ సైట్ లో ముందుగా ఆధార్ OTP ఉపయోగించి రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసేటప్పుడు తమ పేరును నమోదు చేసుకుని బ్యాంకు అకౌంట్, ఆధార్ నంబర్ ను పొందుపరిచి, సర్టిఫికెట్స్ అప్ లోడ్ చేయాలి.

YSR LAW NESTHAM Status: స్టేటస్ ఎలా చూడాలి?

అభ్యర్థులు నేరుగా https://ysrlawnestham.ap.gov.in అధికారిక వెబ్సైట్ లో తమ ఆధార్ otp తో లాగిన్ అయి చెక్ చేసుకోవచ్చు.

For all regular updates on YSR LAW NESTHAM visit below link

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page