తెలంగాణలో ఉన్నటువంటి దళితులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రెండో విడత దళిత బంధు పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం వివరాలను కూడా ప్రకటించడం జరిగింది. దళిత బంధు పథకం ద్వారా అర్హులైన వారికి పది లక్షల రూపాయలను ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్న విషయం తెలిసిందే.
రెండో విడత దళిత బంధులో 1.30 లక్షల మందికి లబ్ది
దళితబంధు రెండో విడత కార్యక్రమాన్ని అతి త్వరలో ప్రారంభించునున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ఇప్పటికే 2023-24 బడ్జెట్లో రూ.17,700
కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. మొదటి విడుదల హుజురాబాద్ నియోజకవర్గం లో చేసిన ఈ కార్యక్రమాన్ని మిగిలిన 118 నియోజకవర్గాలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది.
రెండో విడతలో భాగంగా హుజురాబాద్ మినహా మిగిలిన 118 నియోజకవర్గాల్లో 1,100 కుటుంబాల చొప్పున మొత్తంగా 1,29,800 కుటుంబాలకు ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వర్తింపజేయనుంది. అంతే కాకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోటాలో మరో 200 దళిత కుటుంబాలు కలిపి మొత్తంగా 1.30 కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందుచేనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
త్వరలో ఆన్లైన్లో అప్లికేషన్స్.. పూర్తి ప్రాసెస్ ఇలా
దళిత బంధు మొదటి విడత పథకానికి సంబంధించి ఆన్లైన్ మరియు యాప్ లో ఎప్పటికప్పుడు లబ్ధిదారుల వివరాలను పొందుపరచడం అదేవిధంగా వారు ఏ యూనిట్లను కొనుగోలు చేశారు వారి జీవిత ప్రమాణాలు ఇప్పుడు ఎలా మారాయి అనే విషయాలపై ఇప్పటికే వారి యొక్క వివరాలను పూర్తిస్థాయిలో ఆన్లైన్లో ఉంచినట్లు ప్రభుత్వం తెలిపింది.
ఇదే విధంగా రెండో విడతలో కూడా ఎంతో పారిదర్శకంగా ఆన్లైన్లో లబ్ధిదారుల వివరాలు మరియు వారి కొనుగోలు చేసే యూనిట్ల వివరాలను కూడా పొందుపరుస్తామని అధికారులు తెలిపారు.
రెండో విడత దళిత బంధు పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హర్షం వ్యక్తం చేశారు.
త్వరలో ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు. లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి అధికారులు క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహిస్తారని, విధంగా నిర్వహించిన సర్వే ఆధారంగా అర్హులైన వారి జాబితాలను కలెక్టర్లకు అందించడం జరుగుతుందని తెలిపారు.
కలెక్టర్లు స్థానిక ఎమ్మెల్యే అధ్యక్షతన వివరాలను పరిశీలించి లబ్ధిదారుల తుది జాబితాను ఎంపిక చేయడం జరుగుతుంది. అర్హులైన వారికి నిర్దేశించిన తేదీలలో రెండో విడత దళిత బంధు కింద పది లక్షల రూపాయలను వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది.
10 లక్షలు జమ చేసిన తర్వాత వారు ఏ యూనిట్లను కొనుగోలు చేశారు వారి జీవిత ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపడ్డాయనే అంశాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.
వచ్చే 8 ఏళ్లలో ప్రతి దళిత కుటుంబానికి పది లక్షలు
దశల వారీగా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం వచ్చే ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు అందేలా చూస్తామని ప్రకటించింది.
దళిత బంధు పథకం అర్హతలు ఇవే
➤ ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వ్యక్తి దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి.
➤ సరైన కుల ధ్రువీకరణ పత్రం ఉండాలి.
➤ తెలంగాణ రాష్ట్రం వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది.
➤ తెలంగాణ రేషన్ కార్డు పొంది ఉండాలి.
➤ ఆదార్ కార్డు కలిగి ఉండాలి
ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామన్న ప్రభుత్వం ఆ డబ్బును సొంత వ్యాపారానికి ఖర్చు పెట్టుకోవచ్చంటూ ఇది వరకే 47 రకాల వ్యాపారాలను కూడా సూచించింది. డెయిరీ ఫామ్, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, మెడికల్ షాపులు, ఫర్టిలైజర్ షాపులు, బార్లు, వైన్ షాపులు కూడా నిర్వహించవచ్చు. అవి కాకుండా వేరే వృత్తి ఏదైనా ఎంచుకోవాలని అనుకున్నా దళిత కుటుంబాలు తమ ఆలోచనల ప్రకారం నడుచుకోవచ్చు. కలసి పెట్టుబడులు పెట్టుకొని పెద్ద వ్యాపారానికి శ్రీకారం చుట్టాలనుకున్నా వాటిని స్వాగతిస్తామని ప్రభుత్వం తెలిపింది
Leave a Reply