వైయస్సార్ నేతన్న నేస్తం లబ్ధిదారులకు ఊరట కలిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2023 24 కి సంబంధించి వెరిఫికేషన్ ఈ కేవైసీ నిబంధనలను సడలించింది.
ఇప్పటివరకు పాత లబ్ధిదారుల గైడ్లైన్స్ ప్రకారం, సచివాలయం బెనిఫిషరీ ఔట్రీచ్ యాప్ నందు ఈ కేవైసీ ప్రక్రియ చేపట్టే సమయంలో, కింద పేర్కొన్న మూడు రకాల రసీదులు మగ్గం కలిగి ఉన్న వారికి లేదా మగ్గం లేకపోతే వేరే వారి దగ్గర పనిచేస్తున్న వారికి తప్పనిసరిగా జత చేయాల్సి ఉండేది.
అయితే ప్రస్తుతం వీటిని తప్పనిసరి జాబితా నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇకపై పాత లబ్ధిదారులకు కింది రసీదులు తప్పనిసరి కాదు
సచివాలయం BOP app నుంచి “గత సంవత్సరం” లబ్ధిదారుల eKYC వెరిఫికేషన్ సమయంలో ఈ క్రింది డాకుమెంట్స్ ను mandatory option నుంచి తొలగించడం జరిగింది..
1. GST కలిగిన వెండర్ నుండి గడిచిన 6 నెలలకి సంబందించిన నూలు కొనుగోలు రసీదులు.
2. మాస్టర్ వీవర్ చేత ధృవీకరించబడిన నూలు, వేతనం మరియు ఉత్పత్తులకు సంబందించిన పుస్తకాలు.
3. మాస్టర్ వీవర్ / PHWCS అకౌంటెంట్ నుండి మగ్గం దారునికి పని కల్పిస్తున్నట్టు ధృవీకరణ పత్రము.
అయితే కొత్త లబ్ధిదారులకు ఇప్పటికీ ఇవి తప్పనిసరి
పైన పేర్కొన్న డాక్యుమెంట్స్ తప్పనిసరి ఆప్షన్ నుంచి కేవలం పాత లబ్ధిదారులకు మాత్రమే తొలగించడం జరిగింది. అది దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రం సచివాలయం బెనిఫిషరీ ఔట్రీచ్ యాప్ నందు తప్పనిసరిగా సిబ్బంది ఈ డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఇక వైయస్సార్ నేతన్న నేస్తం పథకానికి సంబంధించి అన్ని లింక్స్ BOP యాప్ మరియు MANUAL కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి
Leave a Reply