ప్రస్తుతం నిత్యవసర ధరలు సామాన్య ప్రజలకు షాక్ ఇస్తున్నాయి.. అటు కూరగాయల నుంచి పప్పులు , నాన్ వెజ్ వరకు ధరలు అమాంతం పెరిగిపోయాయి.
గత నెలతో పోలిస్తే డబుల్ అయిన ధరలు
ద్రవ్యోల్బణం పై కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటిస్తున్నప్పటికి నిత్యావసర సరుకుల ధరలు పట్ట పగలే చుక్కలు చూపిస్తున్నాయి.
గత నెల తో పోలిస్తే ఏకంగా రెండింతలు పెరిగాయి. ముఖ్యంగా కూరగాయల ధరలు చూస్తే గత నెలలో 20 రూపాయల వద్ద ఉన్న టమాటో కిలో ధర ప్రస్తుతం మార్కెట్లో 60 రూపాయలకు చేరింది. ఇక చికెన్ అయితే గత నెలలో 200 రూపాయల వద్ద ఉన్నటువంటి ధర ప్రస్తుతం 300 నుంచి 350 వరకు వసూలు చేస్తున్నారు.
ఇక కందిపప్పు కూడా 100 రూపాయల దగ్గరలో ఉన్నటువంటి కిలో ధర ఈ నెలలో ఏకంగా 130 నుంచి 150 రూపాయలకు చేరుకుంది.
ఒక్క వంట నూనె ధరలు మినహాయిస్తే మిగిలిన అన్ని ధరలు అమాంతం సామాన్యుడికి భారంగా మారాయి.
భారీగా పెరిగిన కూరగాయల ధరలు
ఎండాకాలం మరియు గత సీజన్ లో సరైన దిగుబడి లేక కూరగాయల ధరలు భారీగా పెరిగాయి.
మార్కెట్లో ప్రస్తుతం భారీగా పలుకుతున్న ధరలు ఇవే
టమాటో – కిలో 50 నుంచి 60 రూపాయలు
క్యారట్ – కిలో వంద రూపాయలు పై మాటే
గోరుచిక్కుళ్ళు – కిలో వంద రూపాయలు వరకు ఉంది.
క్యాబేజ్ – ₹20 నుంచి 30 రూపాయల వరకు పలుకుతుంది
కాకరకాయలు – కిలో 50 రూపాయల వరకు పలుకుతుంది
పచ్చి మిర్చి – కిలో 100 నుంచి 140 వరకు అమ్ముతున్నారు
అయితే ప్రస్తుతానికి ఉల్లిపాయలు, బెండకాయ దొండకాయ ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి.
పెరిగిన పప్పు దినుసుల ధరలు
ఇక కూరగాయలకు పోటీగా పప్పులు కూడా భారీగా పెరిగాయి. గత నెల వరకు 100 నుంచి 110 రూపాయల వరకు ఉన్నటువంటి కిలో కందిపప్పు ధర, ప్రస్తుతం మార్కెట్లో 135 నుంచి 150 రూపాయలు గా ఉంది.
ఇక మినపప్పు , పెసరపప్పు ధర సైతం 110 నుంచి 150 మధ్యలో ఉంది.
ఆకాశాన్నంటిన చికెన్ ధరలు.. కిలో 300 పై మాటే
ప్రస్తుత సీజన్లో డిమాండ్ ఎక్కువ ఉండటంతో కోళ్ల ఫారం నుంచి వేసవి కాలం కావడంతో ఎక్కువ దిగుబడి లేకపోవడంతో చికెన్ ధరలకు రెక్కలు వచ్చాయి
గత నెల వరకు 200 కి అటో ఇటో ఉన్నటువంటి కిలో చికెన్ ధర ప్రస్తుతం 300 రూపాయల నుంచి 350 మధ్యలో కొనసాగుతుంది.
అటు మటన్ ప్రస్తుతం 800 నుంచి 900 రూపాయలు కిలో లెక్కన నమ్ముతున్నారు.
పెరిగిన నిత్యవసర ధరలతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. ఋతుపవనాలు మరింత ఆలస్యం అవుతుండడంతో ఈ ప్రభావం మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా మరో రెండు మూడు నెలల్లో ధరలు అదుపులోకి వస్తే తప్ప సామాన్యుడు భరించే పరిస్థితిలో ఈ ధరలు కనిపించడం లేదు.
Leave a Reply