ఆంధ్రప్రదేశ్ లో అర్హత ఉన్నప్పటికీ కొంతమందికి సంక్షేమ పథకాలు అందడం లేదు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. కొంతమందికి సరైన సర్టిఫికెట్లు లేదా ధృవపత్రాలు దొరకక పోవడం ఒక కారణమైతే, రేషన్ కార్డు లో అర్హత లేని వ్యక్తి ఉండటం వలన మిగిలిన అందరికీ సంక్షేమ పథకాలు నిలిచిపోవడం మరొక కారణం.
మీకు కూడా ఇలాంటి కారణమే ఉండి సంక్షేమ పథకాలు అందటం లేదా అయితే మీకు ఒక గుడ్ న్యూస్.. రాష్ట్ర ప్రభుత్వం జూలై ఒకటవ తేదీ నుంచి జగనన్న సురక్ష పథకాన్ని ప్రవేశపెడుతుంది.
ఇకపై సర్టిఫికెట్లు మరియు రేషన్ సమస్యలకు చెక్
ప్రజలకి ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం జగనన్నకి చెబుదాం అనే టోల్ ఫ్రీ నెంబర్ ని ఇప్పటికే అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ సదుపాయం ఉన్నప్పటికీ చాలామందికి ఎన్నో సమస్యలు పరిష్కారం కాకుండా మిగిలిపోతున్నాయి.
ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సురక్ష అనే సరికొత్త పథకాన్ని జూలై 1 నుంచి అమలు చేస్తుంది.
ఈ పథకం ద్వారా గ్రామ వార్డు సచివాలయాల స్థాయిలో ముందుగా ప్రజల సమస్యలను వాలంటీర్లు మరియు సిబ్బంది తెలుసుకుంటారు. అదేవిధంగా సమస్యలను నమోదు చేసుకుంటారు.
ఆ విధంగా నమోదు చేసుకున్నటువంటి సమస్యలను జూలై ఒకటి నుంచి నాలుగు వారాలు పాటు జరుగునున్న జగనన్న సురక్ష ప్రత్యేక క్యాంపుల ద్వారా పరిష్కరిస్తారు.
అసలు ఏంటి ఈ జగనన్న సురక్ష
ప్రజలకు సరైన ధ్రువపత్రాలు లేదా సర్టిఫికెట్లు లేదా రేషన్ కార్డు సమస్యలు లేదా సంక్షేమ పథకాలకు సంబంధించి ఏమైనా అడ్డంకులు ఉంటే వాటిని తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ జగనన్న పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఈ పథకం కింది విధంగా పనిచేస్తుంది
✓ ముందుగా ఇంటింటికి గ్రామ వార్డు వాలంటీర్లు మరియు సిబ్బంది వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని నమోదు చేసుకుంటారు. ఈ ప్రక్రియ జూన్ 24 నుంచి ప్రారంభమవుతుంది
✓ జూలై 1 నుంచి నాలుగు వారాలపాటు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల స్థాయిలో ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తారు.
✓ ఈ క్యాంపు ల ద్వారా గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ఉన్నటువంటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం జరుగుతుంది.
✓ ఎవరికైనా అర్హత ఉంది సరైన ధ్రువపత్రాలు సర్టిఫికెట్లు జారీ కాకపోతే వారికి వెంటనే వీటిని జారీ చేస్తారు.
✓ రేషన్ కార్డులో అర్హత ఉన్నప్పటికి వారితో నివసించని వ్యక్తులు ఎవరైనా ఆదాయపన్ను చెల్లిస్తున్నట్లయితే అటువంటి వారిని తొలగించే ఆప్షన్ కూడా కల్పిస్తున్నారు.
✓ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, రేషన్ కార్డ్ స్ప్లిట్ వంటి ఆప్షన్ ను కల్పిస్తున్నారు.
✓ వీటికి ఎటువంటి చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది.
జగనన్న సురక్ష క్యాంపుల ద్వారా దృష్టి సారించిన ముఖ్యమైన అంశాలు ఇవే
ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ మరియు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనగా కుల ధ్రువీకరణ పత్రం మరియు నివాస పత్రం
ఆదాయ ధ్రువీకరణ పత్రం, బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, మ్యుటేషన్స్, మ్యారేజ్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, ఆధార్ లో మొబైల్ నవీకరించుట, కౌలు రైతులకు సిసిఆర్సి, కొత్త రేషన్ కార్డు లేదా ఉన్న రేషన్ కార్డు ని విభజించడం, హౌస్ హోల్డ్ అంటే కుటుంబ సభ్యులను విభజించడం వంటి ప్రముఖ అంశాలపై జగనన్న సురక్ష కార్యక్రమం దృష్టి సారిస్తుంది. ఈ అంశాలకు సంబంధించి ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే త్వరితగతిన ఈ పథకం ద్వారా పరిష్కరిస్తారు.
ఇవి కేవలం ముఖ్యమైన అంశాలని, ఇవి మాత్రమే కాకుండా ఇంకా ఇతర సమస్యలను కూడా పరిష్కరిస్తామని ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది.
Leave a Reply